రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు తనకు ఫోన్‌ చేశాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. తన పట్ల ఎక్కువ కఠినంగా ఉండటంతో తీసుకెళ్లిపోవాలని తనను కోరాడని వివరించాడు. దాంతో వెంటనే అతడిని టీమ్‌ఇండియా కోచ్‌గా నియమించానని దాదా అన్నాడు. షార్జా బుక్‌ ఫెయిర్‌లో అడిగిన ప్రశ్నలకు అతడు సరదాగా ఇలా జవాబిచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలవగలిగే సామర్థ్యం న్యూజిలాండ్‌కు ఉందని, ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అద్భుతంగా నాయకత్వం వహిస్తున్నాడని ప్రశంసించాడు.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తలపడుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌ వేదికగా సాయంత్ర 7:30 గంటలకు పోరు మొదలవుతుంది. ఇప్పటి వరకు కివీస్‌ ఐసీసీ ప్రపంచకప్‌లు గెలవలేదు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతోంది. మరోపక్క ఆసీస్‌కు పొట్టి ప్రపంచకప్‌లో ఒక్క ట్రోఫీ రాలేదు. వన్డేల్లో మాత్రం బాగానే గెలిచిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ చూపిస్తున్న తెగువ తనకెంతో నచ్చుతోందని దాదా అన్నాడు. 40వ షార్జా బుక్‌ఫెయిర్‌లో అతడు మాట్లాడాడు. ద్రవిడ్‌ నియామకంపై సరదాగా స్పందించాడు.


'రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఇంట్లో తన తండ్రి ఎంతో కఠినంగా ఉంటున్నాడని చెప్పాడు. ఆయన్ను బయటకు తీసుకెళ్లాలని కోరాడు. అందుకే వెంటనే రాహుల్‌కు కాల్‌ చేసి టీమ్‌ఇండియాలో చేరాల్సిన సమయం వచ్చేసిందని చెప్పా' అని దాదా జోక్ చేశాడు. 


'అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్‌కు టైమ్‌ వచ్చిందని అనుకుంటున్నా. ఆసీస్‌ కూడా గొప్ప జట్టే. కానీ కొన్నాళ్లుగా వారు ఇబ్బందులు పడుతున్నారు. మనకు టీవీల్లో కనిపిస్తున్న దానికన్నా మరెన్నో ధైర్య సాహసాలు కివీస్‌లో ఉన్నాయి. ఈ మధ్యే ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలిచారు. చిన్న దేశమే. కానీ ఎంతో పట్టుదలగా ఆడతారు. ఏదేమైనా ఇది కివీస్‌ సమయం అని అనుకుంటున్నా' అని అన్నాడు.


టీమ్‌ఇండియాకూ దాదా అండగా నిలిచాడు. రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, షమీ మానవ మాత్రులేనని అన్నాడు. వారే తర్వాత ట్రోఫీలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశాడు.


Also Read: T20 World Cup 2021: మీమ్‌ క్రియేటర్లకు షాక్‌..! మీమర్స్‌తో మందు కొడతానన్న రవి శాస్త్రి!


Also Read: CK Nayudu: 50 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ.. 62 ఏళ్లప్పుడు చివరి మ్యాచ్, క్రికెట్ చరిత్రలో సీకే నాయుడు ఒక శిఖరం


Also Read: AUS Vs NZ: దుబాయ్ స్టేడియంలో సెంటిమెంట్ ఇదే.. 17 మ్యాచ్‌ల్లో 16 సార్లు.. కేవలం చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే!


Also Read: Shahid Afridi on Virat Kohli: కోహ్లీ అన్నింట్లో కెప్టెన్సీ వదిలేస్తే మంచిది.. రోహిత్‌కు అఫ్రిది మద్దతు


Also Read: Rohit Sharma 264: ఆ ‘264’కు ఏడేళ్లు.. ఆ రోజు రోహిత్ బద్దలుకొట్టిన రికార్డులు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి