దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం, విధ్వంసకర ఆటగాడు, భారతీయులకు ఇష్టమైన క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు! ఇకపై ఏ ఫార్మాట్లోనూ క్రికెట్‌ ఆడబోనని తెలిపాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు.






వయసులో ఉండగానే కుటుంబానికి దూరమవుతుండటం, విరామం దొరక్కపోవడంతో తొలుత టెస్టు క్రికెట్‌కు ఏబీడీ దూరమయ్యాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా తనకు ఇష్టమైన క్రికెట్‌ లీగులను ఆడాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ పతనం అవుతుండటం, సరైన ప్రదర్శన లేకపోవడంతో మళ్లీ టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నించాడు. రెండేళ్లుగా ఐపీఎల్‌లో మోస్తరుగానే ఆడాడు. దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌ రెండో అంచెలో ఒకట్రెండు సార్లు మెరిశాడు.






'ఇదో అద్భుత ప్రయాణం. కానీ అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. మైదానంలో అడుగుపెట్టిన నాటినుంచి నా సోదరులతో కలిసి క్రికెట్‌ మ్యాచులను ఆస్వాదించాను. అచంచలమైన ఉత్సాహంతో ఆడాను. ఇప్పుడు, 37 ఏళ్ల వయసులో నాలోని జ్వాల అంతగా రగలడం లేదు' అని ఏబీ డివిలియర్స్‌ ట్వీట్‌ చేశాడు. 'థాంక్యూ, దాంకీ, ధన్యవాద్‌ (హిందీలో)' అని ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేశాడు. ఆర్‌సీబీ అభిమానులకు ప్రత్యేకంగా వీడియో సందేశం ఇచ్చాడు.


ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొన్నేళ్లుగా ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ మూలస్తంభాలుగా నిలబడ్డారు. సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవారు. మైదానంలో ఆ సోదరభావానికి అభిమానులు పులకించిపోయేవారు. వీరిద్దరూ కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో మురిపించారు. అలాంటి జోడీ ఇకపై మైదానంలో కనిపించదు. కోహ్లీ, ఏబీడీ కలిసి ఆడరని తెలియడంతో ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు!






Also Read: Ind vs NZ- 1st T20, Full Match Highlight: రోహిత్ శర్మకు శుభారంభం.. మొదటి మ్యాచ్‌లో కివీపై విజయం!


Also Read: IND vs NZ: బ్యాటర్‌ను బోల్తా కొట్టించడం బౌల్ట్‌కు నేనే నేర్పించా..! నా బలహీనత అతడికి తెలుసన్న రోహిత్ శర్మ


Also Read: Rachin Ravindra: రాహుల్‌ ద్రవిడ్‌లో 'ర'.. సచిన్‌లో 'చిన్‌' కలిస్తే 'రచిన్‌ రవీంద్ర'.. కివీస్‌లో భారత క్రికెటర్‌


Also Read: Ricky Ponting Update: ఐపీఎల్‌ సమయంలో పాంటింగ్‌కు టీమ్‌ఇండియా కోచ్‌ ఆఫర్‌.. ఎందుకు తిరస్కరించాడంటే?


Also Read: Ind vs NZ 2nd T20I: రెండో టీ20 వాయిదా పడుతుందా? ఏకంగా హైకోర్టులో!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి