శ్రావణ మాసంలో కృష్ణ పక్ష పంచమి రోజున మౌన పంచమిగా ఉపవాసం పాటిస్తారు. ఈ సంవత్సరం జులై 7 న మౌన పంచమి వస్తోంది. మౌన పంచమి సందర్భంగా భక్తులు మౌనం పాటించి ఉపవాసం ఉంటారు. ఈ రోజున శివుడి దక్షిణామూర్తి రూపాన్ని పూజిస్తారు. ఈ రూపంలో శివుడు ఆది గురువుగా, ధ్యానానికి, యోగాభ్యాసానికి మూల పురుషుడైన ఆదియోగిగా ఉంటాడు. మానసిక, సైంద్ధాంతిక, శారీరక హింసను నిరోధించేందుకు మౌనం మంచి మార్గమని మౌన పంచమి నాడు చేసే శివారాధన, మౌనం, ఉపవాసం ద్వారా ఇచ్చే సందేశం. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు మనలోని దూకుడు స్వభావాన్ని, కోపాన్ని నియంత్రించడంలో ఈ రకమైన సాధన మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ప్రాశస్థ్యాన్ని పండితులు వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
శ్రావణ కృష్ణ పక్ష పంచమి తిథి ఈ ఏడాది జూలై 07 తెల్లవారు జామున 3:12 నిమిషాలకు ప్రారంభమై జూలై 08వ తేది ఉదయం 12:17 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జూలై 07 న మౌనపంచమి ఉపవాసం చెయ్యాల్సి ఉంటుంది.
- ఉదయ ముహూర్తం – ఉదయం 05:29 నుంచి
- మధ్యాహ్న ముహూర్తం – మధ్యాహ్నం 12:26 నుంచి 2:10 వరకు
- సాయంత్ర మూహూర్తం – 06:39 నుంచి 7:23 వరకు
మౌన పంచమి ప్రాశస్త్యం
సనాతన ధర్మంలో మౌనపంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అన్న సమస్యల నుంచి బయట పడతారు. మౌన పంచమి వ్రతం పాటించడంవల్ల కాలసర్పదోషం నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకం కూడా ప్రాచూర్యంలో ఉంది. అపమృత్యుభయం కూడా తొలగిపోతుందట. నిష్ఠగా మౌన పంచమి పాటించే వారు సంతానాన్ని ఆశిస్తున్నట్టయితే వారి కోరిక తప్పక ఫలిస్తుందని పండితులు చెబుతున్నారు. దాంపత్య జీవితం కూడా ఒడిదొడుకులు లేకుండా సాగుతుందట. ఈ రోజున శివారాధన చేసుకునే వారిలో జ్ఞాన సముపార్జనకు ఉన్న అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారని కూడా నమ్మకం.
పూజా విధానం
మౌన పంచమి రోజున శివుడికి పంజామృతం, గంగాజలంతో అభిషేకం చేసుకోవాలి. ఈ రోజు దైవం శేషనాగు, అందుకే ఈ రోజున శివుడితో పాటు శేషనాగును కూడా పూజిస్తారు. ఈ రోజున నాగదేవతకు నెయ్యి, డ్రైఫ్రూట్స్, పూలు, పూల దండలు, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజున శివుడు, శేషనాగుకు పూజలు చేయ్యడం వల్ల కాలసర్ప భయం, ధోషం తొలగిపోతాయి. అనుకూల సమయాలు లేనపుడు కూడా సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవని చెప్పవచ్చు. ఈ రోజు మౌన వ్రతం ఆచరించే స్త్రీలకు అఖండ సౌభాగ్యవంతులుగా ఉండే వరం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
Also read : Vastu Tips In Telugu: కారులో ఈ వస్తువులు ఉంచుకోండి అదృష్టం మీతో ప్రయాణం చేస్తుంది!