Vastu Tips : ఇదివరకు రోజుల్లో కారంటే ఒక విలాసం కానీ ప్రస్తుత కాలంలో అవసరంగా మారింది. దాదాపు అందరూ కొంటున్నారు. కొందరైతే కారుని అదృష్టానికి చిహ్నంగా ఆలోచి చాలా ఆలోచించి ఏ రంగు కొంటే కలిసొస్తుందో ఆలోచించి మరీ తీసుకుంటున్నారు. అయితే ఇంటి విషయంలో వాస్తుకి సంబంధించి కొన్ని పాటించినట్టే కారు విషయంలో కూడా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.  వాస్తును అనుసరించి ఫోర్ వీలర్ లో కచ్చితంగా కొన్ని అంశాల గురించి శ్రద్ధ తీసుకోవాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాల నుంచి బయపడొచ్చని విశ్వసిస్తారు. 



  • వాస్తును అనుసరించి కారులో వినాయకుడి చిన్న విగ్రహం పెట్టుకోవాలి. గణపతి కేతువుకు సంబంధించిన వాడు. శివ పుత్రుడు దారిలో వచ్చే అడ్డంకులు తొలగిస్తాడని నమ్మకం. కారులో హనుమంతుడి విగ్రహం పెట్టుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు.

  • కారులో చిన్న నల్ల తాబేలు బొమ్మ ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

  • కార్లో చైనీస్ నాణేలు వేలాడదీస్తే చాలా మంచిదట. ఇవి ప్రతికూలతలను తొలగించి సానుకూల శక్తిని నింపుతుందని విశ్వాసం

  • గళ్లఉప్పు, బేకింగ్ సోడాను కలిపి పొట్లంగా కట్టి కార్ సీట్ కింద ఉంచాలి. మరుసటి రోజు కొత్త పొట్లంలో కట్టి పెట్టుకుంటూ ఉండాలి. వాస్తు ప్రకారం ఇది కారులో ఉండే ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్మకం.

  • కార్ డాష్ బోర్డులో క్రిస్టల్స్ పెట్టుకుంటే శుభప్రదం. ఇవి భూ సంబంధమైనవి కనుక వాహనం సురక్షితంగా ఉంటుంది.

  • కార్లో ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం జలతత్వం ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుంది. అంతేకాదు సౌభాగ్యాన్ని పెంపొందిస్తుంది.

  • కారులో ఎప్పుడూ విరిగిన లేదా పాడైపోయిన వస్తువులు ఉంచకూడదు. కారు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.


Also Read: ఈ రాశులవారికి కొత్త స్నేహితులు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి


పార్కింగ్ ఎక్కడ చేయాలి



  • ఇంట్లో కార్ పార్క చేసే స్థలం వ్యాయువ్యం లేదా ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి.

  • వాయువ్యం లో కారు పార్క్ చేసి ఉంచితే తరచుగా ప్రయాణాలు చేసే అదృష్టం ఉంటుంది.

  • కారు చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి.

  • కారు ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖంగా పార్క్ చేసుకోవడం ఉత్తమం.

  • సంప్ మీద కార్ పార్కింగ్ కి పనికిరాదు.

  • కారు కొనేముందు మీ నక్షత్రం రాశిని అనుసరించి ఏ రంగు కారు మంచిదో తెలుసుకోవడం మంచిది. వాహనం సరైంది కాకపోతే దురదృష్టానికి కారణం కావచ్చు. ప్రమాదాలు జరగవచ్చు.


Also read : శ్రావణ మాసంలో పుట్టినవారు ఎందుకంత ప్రత్యేకం? వారి జీవితం ఎలా ఉంటుంది?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.