Love and Relationship Horoscope 4th July 2023
మేష రాశి
ఈ రాశివారి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని బలోపేతం చేయడానికి కుటుంబం సహాయపడుతుంది. పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రేమికులు ఓ అడుగు ముందుకు వేసేందుకు ఇదే మంచి సమయం. మనసుకి నచ్చినవారికి బహుమతులు ఇస్తారు. ఈ రోజు మీ జీవితంలో అందమైన జ్ఞాపకాలుంటాయి.
మిథున రాశి
ఈ రాశివారి మనసు చంచలంగా ఉంటుంది. కొత్త స్నేహితులు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ ప్రియమైనవారిపై ఎక్కువ అంచనాలు కలగి ఉంటారు. అవివాహితులు వివాహం చేసుకునేందుకు ఇదే మంచి సమయం. స్నేహితుల కారణంగా జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు బావుంటాయి.
Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!
కర్కాటక రాశి
ఈ రాశి వివాహితులు కుటుంబానికి సమయం కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి.భార్యభర్త మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఈ రాశి ప్రేమికులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. అవివాహితులు ఇంకొంత కాలం ఎదురుచూడడం మంచిది. పాతమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులను విస్మరించడానికి ప్రయత్నించండి.
సింహ రాశి
ఈ రాశికి చెందిన వివాహితులైనా, ప్రేమికులైనా ఇద్దరి మధ్యా విభేదాలు తప్పవు. యమైనవారికి సమయం కేటాయించడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరినట్టే కుదురుతుంది కానీ వివాహానికి ఆలస్యం అవుతుంది.
కన్యా రాశి
ఈ రాశికి చెందిన వారి ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. బంధం బలపడేందుకు కొంత సమయం పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగించడంలో మీరు బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో అనవసర వాదనకు దిగొద్దు.
తులా రాశి
మీ ప్రియమైన వారి తీరు ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది. రోజు ప్రారంభంలో కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ నెమ్మదిగా సర్దుకుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తన కొంత వింతగా అనిపిస్తుంది.
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!
వృశ్చిక రాశి
ఈ రాశి ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. పెళ్లి ఆలోచన ఉన్నవారు కుటుంబాలను సంప్రదించేందుకు ఈరోజు మంచి రోజు. మీ ప్రతిపాదనలకు సానుకూల స్పందన వస్తుంది. వైవాహిక బంధంలో ఉండేవారు సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉండేవారికి ప్రేమ జీవితం మొదలయ్యే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
మీ ప్రేమ భాగస్వామిపై మీరు పెట్టుకున్న ఆశలు ఈ రోజు నెరవేరుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మధ్య ఉన్న కొన్ని భావోద్వేగాలను పంచుకుంటారు. ఓ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మీ జీవిత భాగస్వామిలో ఆనందం చూస్తారు.
మకర రాశి
ఈ రాశి వారికి పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామితో అన్యోన్యత తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలు, కార్యాలయ బాధ్యతలలో మునిగితేలుతారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది.
కుంభ రాశి
ఈ రాశివారికి వైవాహిక జీవితంలో చేదు క్షణాలు మాయమై సంతోషకరమైన జీవితం మళ్లీ మొదలవుతుంది.వైవాహిక జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులు తమ ప్రియమైనవారితో మంచి సమయం స్పెండ్ చేస్తారు.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి ప్రేమికులు పెళ్లి గురించి తీవ్రంగా చర్చించుకుంటారు..మాట మాటా పెరిగి వివాదం జరిగే అవకాశం ఉంది. రిలేషన్ షిప్ లో మునుపటి సంతోషం కోసం ప్రయత్నిస్తారు కానీ అది అంత సులభం కాదు. ఇద్దరి మధ్యా నమ్మకం కొరవడుతుంది. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial