Shravan Somvar Significance: శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెల. కార్తీకమాసంలో నెలరోజులూ పూజలు, ఉపవాసాలు చేసినట్టే శ్రావణం మొత్తం శక్తిపూజతో నిండిపోతుంది. ఈ నెలలో ప్రతి రోజూ ప్రత్యేకమే. శ్రావణమాసంలో వచ్చే సోమవారం అత్యంత ఫలవంతమైనదిగా పరిగణిస్తారు. ప్రతి సోమవారం శివయ్యకు ప్రత్యేకమే..అయితే శ్రావణంలో సోమవారం ఉపవాసం ఆచరించి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయని భక్తుల విశ్వాసం. అభిషేక ప్రియుడైన శివుడికి చెంబుడు నీళ్లు సమర్పించినా చాలు కరిగిపోతాడు.
శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే సోమవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు శివ భక్తులు. ఆగష్టు 09 శనివారం రాఖీ పౌర్ణమి వచ్చింది. ఈ లోగా వచ్చే సోమవారం ఆగష్టు 04 అవుతుంది. అంటే పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ఇదే. ఈరోజు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఆగస్టు 4 న సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. అదే సమయంలో, చంద్రుడు అనురాధ నక్షత్రం , చిత్త నక్షత్రం నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో పాటు శ్రావణ సోమవారం నాడు బ్రహ్మ , ఇంద్ర యోగాల కలయిక కూడా ఏర్పడుతోంది. ఈ శుభ యోగాలలో చేసే పూజలు, ఉపవాసాల వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుంది.
శ్రావణ మాసంలోని అన్ని సోమవారాల కన్నా పౌర్ణమి ముందువచ్చే సోమవారం నాడు చేసే ఉపవాసం-పూజలు మతపరంగా , జ్యోతిష్యపరంగా కూడా చాలా ఫలవంతమైనవిగా పరిగణిస్తారు.ఈ సోమవారం ఆచరించే ఉపవాసం సాధకుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది. మొత్తం శ్రావణమాసంలో చేసే పూజల ఫలితం మొత్తం ఈ ఒక్క సోమవారం పొందుతారు. ఈ రోజు రుద్రాభిషేకం, శివ పురాణ పారాయణం, జలాభిషేకం, రాత్రి జాగరణకు ప్రాముఖ్యత ఉంటుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ఉపవాసం చేయడం వల్ల ఫలితం ఏంటి?
జ. ఈ సోమవారం ఉపవాసం చేయడం వల్ల పూజల ఫలితం లభిస్తుంది , కోరికలు నెరవేరుతాయి.
ప్ర. పౌర్ణమి ముందు వచ్చే సోమవారం ఏం చేయాలి?
జ. సోమవారం ఉపవాసం, రుద్రాభిషేకం, జలాభిషేకం లేదా శివనామంతో రాత్రి జాగరణ చేయాలి.
ప్ర. పౌర్ణమి ముందు వచ్చే సోమవారం శివలింగానికి ఏం సమర్పించాలి?
జ. నీరు, పాలు, బిల్వపత్రం, బూడిద, తెల్లని పువ్వులు, తేనె, గంగాజలం, పంచామృతం సమర్పించడం శుభప్రదం.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం - సులభమైన పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవరలక్ష్మీ వ్రతకథ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
శివ శక్తి రేఖ: కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే సరళ రేఖపై 7 శివాలయాలు ఎందుకున్నాయి - దీనివెనుకున్న రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి...12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడున్నాయి, వాటి విశిష్టత ఏంటో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి