ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు..ఇంకా వివిధ కారణాలతో ఇంటినిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది.  కొన్నిసార్లు మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా చేయాల్సిన పనులేంటి, పెండింగ్ పెట్టాల్సిన పనులేంటన్నది క్లారిటీ ఉండాలి. ఈ పద్ధతులు ఫాలో అవకపోతే వాస్తు దోషాల నుంచి తప్పించుకోలేరు అంటారు వాస్తు పండితులు. 


ఇంటి నిర్మాణం మధ్యలో ఆపేయాల్సి వస్తే వాస్తు ప్రకారం ముందుగా ఏం పూర్తిచేయాలి, ఏ పనులు పెండింగ్ పెట్టాలి



  • ఇంటిలోపల ఫ్లోరింగ్‌ ఆపొచ్చు కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వేయాలి. ఇంటి లోపలలో లెవల్‌ పెట్టకూడదు

  • లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులకు సంబంధించిన చెక్కపని ఆపొచ్చు

  • ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయొచ్చు

  • ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపుకోవచ్చు

  • ఇంటి ఆవరణలో సిమెంట్ పనులు ఆపొచ్చు కానీ మట్టితో లెవెల్ చేయించాలి

  • పూజగది కట్టిన తర్వాతే దానిలో అలంకరణకు సంబంధించిన పని చేయాలి

  • గ్రిల్‌కు సంబంధించిన పనులు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు, మెట్ల నిర్మాణం కూడా వాయిదా వేసుకోవచ్చు

  • కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటాన్ని ఆపొచ్చు

  • కాంపౌండ్‌ వాల్ నిర్మాణం ఆపుకోవచ్చు కానీ గోడ మాత్రం సరిగా ఉండేలా చూసుకోవాలి

  • శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టింగ్, ఫినిషింగ్ తప్పనిసరిగా చేయాలి

  • ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి

  • అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని అసంపూర్ణంగా ఆపకూడదు

  • మేడ మీద,మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు

  • గృహ నిర్మాణం పూర్తైన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు

  • గృహనిర్మాణం పూర్తైన తర్వాత గృహ ఆవరణలో ఆగ్నేయం, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశల్లో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.


గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి. 


గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 
Also Read: అద్దె ఇల్లు అయినా వాస్తు నియమాలు కొన్ని పాటించాలి, లేదంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తప్పవ్