Varuthini Ekadashi 2024 Date Time: ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి.. ప్రతి ఏకాదశీ ప్రత్యేకమే. వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. వరూథిని ఏకాదశిని బరుతాని ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది మే 4న వరూథిని ఏకాదశి వచ్చింది. ఈ రోజు ప్రాముఖ్యత, శుభ ముహూర్తం, దీనివెనకున్న పురాణ కథేంటి


Also Read: : ఇవాల్టి నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!


వరూథిని ఏకాదశి తిథి - మూహర్తం వివరాలు


ఏకాదశి తిథి ప్రారంభం  - మే 3 శుక్రవారం రాత్రి 8.30
ఏకాదశి తిథి ముగింపు   - మే 4 శనివారం సాయంత్రం 6.03
నక్షత్రం  - పూర్వాభాద్ర రాత్రి 7.54 వరకు
అమృత ఘడియలు -  మధ్యాహ్నం 12.28 నుంచి 1.57 వరకు
వర్జ్యం: తెల్లవారు జామున 4.50
దుర్ముహూర్తం: సూర్యోదయం నుంచి ఉదయం 7.17 వరకు 


శనివారం మొత్తం ఏకాదశి తిథి ఉంది...అందుకే వరూథిని ఏకాదశి మే 4 శనివారం. ఏకాదశి రోజు ఉపవాసం పాటించి మే 5 ఆదివారం ద్వాదశి ఘడియలు పూర్తవకముందే పూజ పూర్తిచేసి భోజనం చేయాలి. ఈ రోజు విష్ణుమూర్తితో పాటూ లక్ష్మీదేవి, తులసిని కూడా పూజించాలి.


Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభం - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలి!


వరూథిని ఏకాదశి ప్రాముఖ్యత


వరూథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చెబుతారు. బ్రహ్మపై కోపంతో ఐతో తల ఖండించిన శివుడు... ఆ శాప విముక్తి కోసం వరూథిని ఏకాదశి ఉపవాసం పాటించాడని చెబుతారు. సూర్యగ్రహణం సమయంలో బంగారం దానం చేయడం ద్వారా పొందే ఫలితం వరూథిని ఏకాదశి వ్రతం చేయడం వల్ల కలుగుతుందని పురాణాల్లో ఉంది. ఉపవాసాన్ని విరమించే ముందు పండితుల ఆశీశ్సులు తీసుకోవాలి. ఈ రోజు నువ్వులు దానం చేయడం అంటే బంగారం దానం కన్నా పుణ్యప్రదంగా భావిస్తారు. ఎండలు మండే సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ఆహారం, నీరు చేయడం అత్యుత్తమం. ఏకాదశి ఉపవాసం మనస్సు , శరీరం రెండింటిపైనా ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కఠిన ఉపవాసం కాకుండా పండ్లు తినొచ్చు...



  • వరూథిని ఏకాదశి రోజు కొందరు శ్రీ మహా విష్ణువు అవతారం అయిన వామనమూర్తిని పూజిస్తారు

  • మరికొందరు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. ఈ రోజు మధురాష్టకం పఠిస్తే అష్ట కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, ప్రేమ, సంతోషం, ఐశ్వర్యం ఉంటుందని భావిస్తారు.

  • కష్టాల్లో ఉన్నవారు ఇదే రోజు గజేంద్రమోక్ష పఠిస్తారు

  • భక్తి , ముక్తికోసం విష్ణుసహస్రనామం పఠిస్తారు లేదంటే వింటారు

  • పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని 11వ అధ్యాయాన్ని పఠిస్తారు


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


వరూథిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ  ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల  స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు గౌరవం, సరి సంపదలు పొందుతారు. వేల ఏళ్లు తపస్సు చేస్తే ఎంత ఫలితమో వరూథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అంతే పుణ్యం అని భవిష్య పురాణంలో ఉంది. రావణుడిని ఓడించిన రాజు మాంధాత ఈ వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుంచి బయటపడి స్వర్గానికి వెళ్లాడని...శ్రీ కృష్ణుడు ఈ వ్రత మహిమను ధర్మరాజుకి వివరించాడు.