శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పవిత్ర క్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారిని, శ్రీ కృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కొవిడ్19 నిబంధనలు కఠినతరం చేశారు. నేడు పార్వేట ఉత్సవం సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు మూడు సార్లు స్వామి వారి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. పార్వేట ఉత్సవం కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Covid Update: ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!