దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఓ పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. భారత్ సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని విడుదల చేసినట్లు తెలిపారు.
ప్రపంచంలోనే భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అతిపెద్దదని ఈ సందర్భంగా మాండవీయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ముందుచూపు వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖుల ప్రశంసలు..
భారత్ చేరుకున్న మైలురాయిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్లు శక్తిని అందించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఆదివారానికి ఏడాది పూర్తయిన సందర్భంగా టీకా పంపిణీ కోసం కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దేశవ్యాప్తంగా మొత్తం 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి