Tirumala Darshan by walk: ప్రతి హిందువు జీవితకాలంలో దర్శించుకోవాలి అనుకునేక్షేత్రాల్లో తిరుమల ఒకటి. ఇప్పుడంటే శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు సౌకర్యాల పెరిగాయి కానీ ఒకప్పుడు కాలినడకనే ఏడుకొండలు ఎక్కేవారు.


అందరికీ తెలిసిన నడక దారి ఒక్కటే అదే అలిపిరి మాత్రమే..కానీ శ్రీనివాసుడి సన్నిధికి చేరుకునేందుకు మరో ఆరు దారులు..అంటే అలిపిరితో కలిపి ఏడు దారులున్నాయి. కాలక్రమేణా నాలుగు దారులు మరుగున పడిపోయాయి. 


అలిపిరి మార్గం


వేంకటేశుడి భక్తుడైన తాళ్ళపాక అన్నమాచార్యులు  తిరుమలేశుడిని మాత్రమే కాదు అహోబిలంలో  నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. అలిపిరి నుంచి కొండెక్కిన మొదటి వ్యక్తి అన్నమయ్య. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించగా.. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు. అలిపిరి నుంచి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుంచి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. అలిపిరి నుంచి మెట్ల దారి ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొంతకాలం పాటూ భక్తులు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు.


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!


శ్రీవారి మెట్టు మార్గం


శ్రీనివాస మంగాపురం నుంచి 5  కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టు మార్గం ఉంది.  సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఈ మార్గం గుండా ఎడుకొండలు ఎక్కాడని చెబుతారు. నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసమంగాపురం నుంచి ఈ మార్గం గుండా తిరుమల చేరుకున్నారు. పురాణాల ప్రకారం ఇదే మొదటి, ప్రాచీనమైన మార్గం. ఆ తర్వాత కాలంలో సాళువ నరసింహరాయలు ఈ దారిని ఆధునీకరించారు. శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ దారిలోంచే ఏడుసార్లు స్వామివారి దర్శనార్థం కొండెక్కారని చెబుతారు. చంద్రగిరివైపు ఉన్న ఈ దారి కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది


మామండూరు అడవి మార్గం


ఈ రెండు దారుల తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి అంటే మామండూరు దారి. తిరుమల గిరికి ఈశాన్యం వైపు ఉండే నడకమార్గం ఇది. రాయలసీమ నుంచి వచ్చే భక్తులకు ఈ దారి అనుకూలం. మామండూరు మార్గంలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్లతో మెట్లను ఏర్పాటు చేశారు.  


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం , పాపవినాశనం మీదుగా మార్గం


కడప జిల్లా సరిహద్దు - చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కలా దొడ్డి నుంచి తుంబురు తీర్థం , పాపవినాశానానికి, అక్కడి నుంచి తిరుమలకు నడక దారి ఉంది. దీన్ని తుంబుర తీర్థం అని పిలుస్తారు. కుక్కలా దొడ్డి నుంచి సెలయేటి గట్టు మీదనుంచి వస్తే తుంబుర తీర్థం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి పాపవినాశనం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత అవ్వాచారి కోనదారి, మొదటి ఘాట్ రోడ్డు, మోకాళ్ల పర్వతం వస్తుంది. 


రేణిగుంట నుంచి అవ్వాచారి కోన దారి 


రేణిగుంట సమీపంలో తిరుపతి - కడప రహదారిలో ఆంజనేయపురం నంచి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం చేరుకోవచ్చు. అక్కడే రామానుజాచార్యుల ఆలయం ఉంది. అక్కడి నుంచి ముందుకు సాగితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. ఆ తర్వాత అవ్వాచారి ఆలయం వస్తుంది..అలా మండపాలు దాటుకుంటూ వెళితే శ్రీవారి సన్నిధికి చేరుకోవచ్చు. కల్యాణి డ్యాం నుంచి  నారాయణగిరి నుంచి తిరుమల చేరుకోవచ్చు


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి! 


ఏనుగుల దారి 


అప్పట్లో  తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుంచే ఎనుగుల ద్వారా చేరవేసేవారు. అందుకే ఏనుగుల దారి అని పిలిచేవారు. ఇది చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుంచి అవ్వాచారి కోనవరకూ ఈ దారి ఉంటుంది.  


తలకోన మార్గం


తలకోన నుంచి జలపాతం దగ్గరనుంచి జండాపేటు దారిలో వస్తే తిరుమల మరో దారి కనిపిస్తుంది. ఇది 20 కిలోమీటర్లు ఉంటుంది. తిరుమల గిరులకు తలభాగంలో ఉండే కోన కావడంతో తలకోన అంటారు.


ఇంకా శేషాచలం కొండల్లోంచి చిన్న చిన్న మార్గాలను భక్తులు అనుసరించేవారు..ఇప్పుడు వీటిలో కొన్ని మార్గాలు పూర్తిగా మరుగున పడిపోగా.. భక్తులు ఎక్కువగా అనుసరిస్తున్న మార్గం అలిపిరి...