Ratha Saptami 2024  :  మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథిని ‘రథ సప్తమి’గా జరుపుకుంటారు. 2024 ఫిబ్రవరి 16 రథసప్తమి వచ్చింది. సూర్యరథం దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.  అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించిన రోజు ఇది..అందుకే సూర్య జయంతి, రథ సప్తమిగా పూజలందిస్తారు. 


వారాలు-రాశులకు సంకేతం
సూర్యరథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి, సూర్యరథానికి ఒక ఏడాది పడుతుంది.


ఒకే సూర్యుడు 12 రూపాలు
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత' 
2. వైశాఖంలో అర్యముడు
3. జ్యేష్టం-మిత్రుడు
4. ఆషాఢం-వరుణుడు
5. శ్రావణంలో ఇంద్రుడు
6. భాద్రపదం-వివస్వంతుడు
7. ఆశ్వయుజం-త్వష్ణ
8. కార్తీకం-విష్ణువు
9. మార్గశిరం- అంశుమంతుడు
10. పుష్యం-భగుడు
11. మాఘం-పూషుడు
12. ఫాల్గుణం-పర్జజన్యుడు
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు 


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


రథసప్తమి నుంచే అసలైన ఉత్తరాయణం


భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. మాఘ మాసంలో సూర్యుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదనిని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం నుంచి భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. అందుకే రథసప్తమి అంత విశేషమైన రోజని చెబుతారు.


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


సూర్యుడు జ్ఞానమండలం


జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధిదేవత సూర్యుడు. సూర్యుడు జ్ఞానమండలం అని సూర్యమండలాష్టకమ్‌ చెబుతుంది. ‘జయాయ జయ భద్రాయ’ అంటుంది ఆదిత్య హృదయం. శరీరయాత్రలో జీవుడు చేసే కర్మలన్నింటికీ సాక్షీభూతుడు సూర్యుడు. బాహ్యప్రపంచాన్ని వెలిగించడంతో పాటు, అంతరంగంలో ఆవరించిన అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం  సూర్యబింబం. ప్రత్యక్ష దైవంగా సూర్యుణ్ని ఆరాధిస్తే పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందని సాధకుల ప్రగాఢ నమ్మకం. అందుకే సూర్యుడు సూర్యనారాయణ స్వామిగా రథ సప్తమిరోజు పూజిస్తారు. 


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!


దేశవిదేశాల్లోనూ సూర్యారాధన


శ్రీ మహా విష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు  నిర్వహిస్తారు. మంగళూరు వీర వేంకటేశ్వరస్వామి కోవెలలో రథోత్సవం వైభవంగా జరుగుతుంది. తిరుపతి క్షేత్రంలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు  ఏడుకొండలవాడు సప్తవాహనుడై సప్తాశ్వ సూర్యుడిలా ప్రకాశిస్తాడు.


Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!


ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ ||