మంగళం అంటే శుభప్రదం-శోభాయమానం, సూత్రం అంటే తాడు- ఆధారమని అని అర్థం. పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. వేదమంత్రాల సాక్షిగా బంధాన్ని ముడివేసే ఈ దారం భార్యభర్త అనుబంధానికి ప్రతీక.భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేయిస్తారు వేదపండితులు.
Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!
మంగళసూత్రం విషయంలో పాటించాల్సిన విషయాలు
- మంగళసూత్రం స్త్రీ హృదయాన్ని తాకుతూ వక్షస్థలం కిందవరకూ ఉండాలి
- పసుపు కుంకుమలు సౌభాగ్యానికి ప్రతీకలు కాబట్టి... మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి.
- నిత్యం తాడుకి పసుపురాసుకోవడం, సూత్రాలకు కుంకుమ పెట్టుకోవడం చాలా మంచిది
- చాలామంది మంగళసూత్రంలో పగడాలు, ముత్యాలు, చిన్నచిన్న ప్రతిమలు పెట్టించుకుంటారు. అవి ఫ్యాషన్ కోసం చేస్తారు కానీ అలా చేయకూడదంటారు పండితులు.
- సూత్రంపై బొమ్మలు గీయించడం, రంగులు దిద్దించడం చేయరాదు. దేవుడి ప్రతిమలు మంగళసూత్రంపై ఉండరాదు
- సూత్రానికి ఎరుపు, నలుపు పూసలు తప్పకుండా ఉండేలా చూడాలి
- మంగళ సూత్రాలకు చాలామంది పిన్నీసులు పెడతారు కానీ వాస్తవానికి సూత్రాలకు ఎలాంటి ఇనుము వస్తువు తగలకూడదు.
- ఇనుము నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. దీంతో భర్త అనారోగ్యం పాలవుతారని, ఇద్దరి మధ్యా అన్యోన్యత తగ్గుతుందని చెబుతారు
- మంగళ సూత్రంలో ముత్యం,పగడం ధరిస్తుంటారు. ముత్యం, పగడం సూర్యుని నుంచి వచ్చే కిరణాలలో ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి ఆరోగ్యాన్ని ఇస్తుందట. పైగా జంట మధ్య ఉన్న గ్రహదోషాలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతారు. స్త్రీలకు కుజ గ్రహ ప్రభావం వలన అతికోపం, కలహాలు, మొండితనం, అనారోగ్యం, రుతుదోషాలు ఏర్పడతాయి. పగడం, ముత్యం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోట్: హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం వెనుక సహేతుకమైన కారణాలుంటాయి. విశ్వాసం ఉన్నవారు వితండవాదం చేయకుండా ఫాలో అవడమే మంచిది. వాటిపై నమ్మకం లేనివారు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు
Also Read: దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసే స్థలం, శివయ్య ధ్యానం చేసిన మహిమాన్విత ప్రదేశం
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం