ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోన గుహాలయం ఉంది. పద్మావతి, వెంటేశ్వరుల కళ్యాణ మహోత్సవం చూసేందుకు వచ్చిన శివపార్వతులు అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధులై అక్కడే కొంతకాలం ధ్యానం చేశారని చెబుతారు. అందుకే ఈ కొండకు కైలాస కోన అనే పేరువచ్చినట్టు పురాణ కథనం. ఇక్కడున్న జలపాతం ప్రత్యేకత ఏంటంటే ఏడాది పొడవునా జాలువారుతూనే ఉంటుంది. 


Also Read:  పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే


కైలాసకోన గుహాలయంలో శివలింగాన్ని దర్శించుకోవచ్చు. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం, దాని పక్కన వీరభద్రుని ప్రతిమ ఉన్నాయి. వీరభద్రుడి విగ్రహం పక్కన ఆదిశంకరాచార్యుల శిల్పం ఉంటుంది.ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అలజడులు, ఆందోళనలు మాయమై ఊరట లభిస్తుందంటారు భక్తులు.


Also Read:  అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


పుత్తూరు నుంచి 13 కిలోమీటర్లు, నగరి నుంచి 20 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 46 కిలోమీటర్లు దూరంలో ఉన్న కైలాసకోన జలపాతం నీరు స్వచ్ఛంగా ఉంటుంది.ఈ నీటిలో ఎన్నో ఖనిజవిలువలతో ఉండటంతో...ఈ జలపాతంలో స్నానమాచరిస్తే పుణ్యంతోపాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్నది ప్రజల విశ్వాసం. అయితే ఇక్కడకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో టూరిస్టులు ఎవ్వర్నీ ఇక్కడకు వెళ్లేందుకు అనుమతించరు. దాదాపు 100 అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం నీరు ఆ పక్కనే ఉన్న రెండు చిన్న చెరువుల్లోకి చేరుతుంటుంది. సందర్శకులు ఆ నీటిలో దిగొచ్చు కానీ జలపాతం దగ్గరకు వెళ్లలేరు. తిరుపతి, పుత్తూర్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. కైలాసకోన జలపాతం వద్ద ఏపీ టూరిజం అతిథి గృహాలున్నాయి. 


కైలసకోన జలపాతం సందర్శనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అనుకూలమైన సమయం. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఆ సమయంలో అప్పటి వరకూ కురిసిన వానల వల్ల మరింత ఎగసి పడే జలపాతం హొయలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. 


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


శివాష్టకం


ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ |
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే || 1 ||


గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ |
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే || 2||


ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే || 3 ||


వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే || 4 ||


గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ |
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే || 5 ||


కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||


శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||


హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||


స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ||