Kannappa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపజిల్లాలో ఓ గ్రామానికి చెందిన తిన్నడు ఓ బోయవాడు, నాస్తికుడు. అర్జునుడి అవతారమే తిన్నడు అని పురాణకథనం. 


ఒకప్పుడు అర్జునుడు శివుడి కోసం ఘోర తపస్సు  ఆచరించాడు. అర్జునుడి భక్తికి, తపస్సుకి మెచ్చిన శంకరుడు...ఓసారి అర్జునుడిని పరీక్షించాలి అనుకున్నాడు. తపోభంగం కలిగించాలనే ఉద్దేశంతో ఓ అడవిపందిని పంపించాడు శివుడు. తపో భంగం చేస్తున్న పందిని చూసి సహనం కోల్పోయిన అర్జునుడు కోపంగా బాణం సంధించాడు. అదే సమయంలో బోయవాడి వేషంలో వచ్చిన శివుడు కూడా బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. అర్జునుడి పట్టుదలకు మెచ్చిన శివుడు..తన అసలురూపంతో ప్రత్యక్షమై..వరం కోరుకోమన్నాడు. 


శివుడుని అర్జునుడు కోరిన మొదటి వరమే..పాశుపతాస్త్రం 
ఈ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని..ఆ తర్వాత తిరిగి నా వద్దకే చేరుతుందని శివుడు చెప్పాడు. 


రెండోవరంగా మోక్షాన్ని ప్రసాదించమన్నాడు..
ఈ జన్మలో మోక్షం ప్రసాదించడం సాధ్యం కాదు..ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనాల్సి ఉంది. పైగా పాశుపతాస్త్రం అడిగిన ఉద్దేశమే అది. అందుకే నా ద్వారా మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు.


Also Read: శివరాత్రి మహత్యాన్ని చెప్పే అద్భుతమైన కథలివి.. లింగోద్భవ సమయానికి ఇలా చేయండి!


శివుడి వరంతోనే అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు..
 
తిన్నడు ఓశారి  శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడాడు. తిందామని కాల్చుకుని సిద్ధం చేసుకున్నాడు. కాళ్లు చేతులు కడుక్కుని వద్దాం అనుకుని చేతిలో పందిని పట్టుకుని నీళ్లకోసం వెతకడం ప్రారంభించాడు. అలా అలా వెళుతుండగా చాలాకాలంగా పూజ పునస్కారం లేని ఓ శివలింగం కనిపించింది. అయ్యో శివుడికి చాలా రోజుల నుంచి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించాడు. తన వద్ద ఉన్న పందిమాంసం నివేదించాలనుకున్నాడు. స్నానం చేయకుండా ఎలా తింటాడు అనే ఆలోచనతో పక్కనే ఉన్న సరస్సు దగ్గరకు వెళ్లి దోసిలితో నీళ్లు తీసుకునే అవకాశం లేక నోటితో తీసుకొచ్చి శివలింగంపై పోసాడు. ఆ పక్కనే ఉన్న పూలు, ఆకులతో శంకరుడుని అలంకరించాడు. తన వద్దనున్న పందిమాంసాన్ని నివేదించాడు. భక్తికి మెచ్చిన శివుడు నేరుగా ఆరగించాడు. అంతే అది చూసి పొంగిపోయిన తిన్నడు..అక్కడే ఉండిపోయాడు. రోజూ అలాగే చేయడం ప్రారంభించాడు. 


Also Read: ఈ రోజు కళ్లారా చూసింది కూడా రేపు తెల్లారేసరికి మాయే.. శివుడివి ఈ పాటలు వింటే మీకు పూనకమే!


శివుడు మాంసం తినడం వెనుకా ఓ కథ ఉంది..


ఒకప్పుడు సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. శివుడికోసం తపస్సు చేసి మోక్షం ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు ...మీరు వచ్చే జన్మలో అడవిలో పందులుగా జన్మిస్తారు ఓ వేటగాడు మిమ్మల్ని వేటాడి నాకు ఆహారంగా సమర్పిస్తాడు. నేను ఆ మాంసం తినడం వల్ల మీకు మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు. అలా ఆ అడవి పందుల మాంసాన్నే శివుడు ఆరగించి తన భక్తులకు మోక్షం ప్రసాదించాడు.


ఇంత అపచారమా?


శివుడు మాంసం తిన్నాడు


నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగింది


శివలింగం మీదున్న పూలను కాలి చెప్పులతో తీశారు


నిత్యం ధూప దీప నైవేద్యాలుతో వెలగాల్సిన శివుడి సన్నిధిలో ఇదంతా ఏంటని బాధపడ్డాడు శివగోచర అనే బ్రాహ్మణుడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఏంటి శివయ్యా ఇదంతా అని తలని శివలింగానికి బాదుకుని ప్రాణం విడుద్దామనుకున్నాడు. అప్పుడు వారించిన శివుడు కాసేపు అలా పక్కన దాక్కుని ఏం జరుగుతుందో చూడు అని పంపించాడు. 


కాసేపటికి తిరిగొచ్చాడు తిన్నడు. రోజూలానే చేతిలో మాంసం , నోట్లో నీళ్లు , పూలు తీసుకొచ్చాడు. నోట్లో నీళ్లను శివలింగంపై పోసి... ఆ తర్వాత అలంకారం చేశాడు. పందిమాంసాన్ని నైవేద్యం పెట్టాడు. కానీ శివుడు తినలేదు. రోజూ తినే శివుడు ఈ రోజు ఎందుకు తినడం లేదో అనుకుని బాధపడ్డాడు. కాసేపటికి శివలింగం నుంచి రక్తం కారడం గమనించాడు. అయ్యో కంటినుంచి రక్తం వస్తోందే అనుకుంటా తన కంటిని పీకేసి పెట్టేశాడు. మరో కంటి నుంచి రక్తం రావడం చూసి..రెండో కంటిని తీసేద్దాం అని సిద్ధమయ్యాడు. కానీ ఎలా? రెండో కన్ను పీకేస్తే కనిపించదు కదా అని ఆలోచించాడు. అప్పుడు గుర్తుగా రక్తం కారుతున్న శివలింగం కంటిదగ్గర కాలిని పెట్టి మరో కన్ను పెకిలించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు తిన్నడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్ష్యమై చూపు ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుకే ఉండి చూసిన శివగోచర అనే బ్రాహ్మణుడు తిన్నడి భక్తి చూసి ఆశ్చర్యపోయాడు.  


అలా తిన్నడు భక్త కన్నప్పగా మారాడు.. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడని అర్థం..


Also Read: పంచారామాలు, పంచభూత లింగాలు మాత్రమే కాదు..పంచకేదార క్షేత్రాల గురించి తెలుసా!