Daily Horoscope for 17 August 2024 


మేష రాశి 


ఈ రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇదే మంచి సమయం.  పని  ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసర విషయాలగురించి ఎక్కువ ఆలోచంచవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది


వృషభ రాశి


వ్యాపారంలో మీకు మంచి లాభాలొస్తాయి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ పనులు, ప్రణాళికలపై పూర్తిస్థాయిలో శ్రద్ద వహించాలి.  మీ మాటలు , ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది.  ఈ రోజు ఓ అశుభ వార్త వింటారు. ఆరోగ్యం బావుంటుంది. 


మిథున రాశి


అనుకున్న పనులేవీ పూర్తికవడం లేదని ఎక్కువ ఆలోచించవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై శ్రద్ధ వహించండి. ఒకరి మాటలు విని ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు. కుటుంబంలో పెద్దల సలహాలు స్వీకరించి ముందడుగు వేయాలి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు మళ్లీ తెరపైకివస్తాయి.


Also Read: ముగ్గురు మగాళ్లకు పుట్టిన అన్నదమ్ములే వాలి సుగ్రీవులు అని మీకు తెలుసా?
 
కర్కాటక రాశి


ఈ రోజు మీరు ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాల్సి ఉంటుంది. మితిమీరన ఖర్చు చేసే అలవాట్లవల్ల ఇబ్బంద పడతారు. పిల్లలు చదువులో వృద్ధి చెందుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగు వేసేందుకు మంచి రోజు, కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. 


సింహ రాశి


ఈ రోజు మీ ఇంటికి అనుకోని అతిథి వస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంంది, ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఆస్తికి సంబంధించిన కొన్ని పనులు నిలిచిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్నవారు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. 


కన్యా రాశి


మీరు చేసే పనిపై ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబ సభ్యులతో బాగా కలసిపోతారు,సమస్యలపై చర్చిస్తారు. బంధాలు బలపడతాయి. కార్యాలయంలో సమస్యల గురించి సీనియర్లతో చర్చిస్తారు. పాతజ్ఞాపకాలు వెంటాడుతాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు.


Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!


తులా రాశి
 
మీ పురోభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి. కార్యాలయంలో ఉద్యోగులు చేసే పనుల్లో తప్పులు దొర్లవచ్చు.ఉద్యోగంలో సమస్యల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తారు..ముందడుగు వేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు చేయొద్దు. 


వృశ్చిక రాశి 


ఈ రోజు మీకు చాలా శ్రమతో కూడుకున్న రోజు.  పనిలో అడ్డంకుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు. సౌకర్యాలపై శ్రద్ధ వహిస్తే మీకు మంచిది.  తల్లిదండ్రులకు సేవ చేయడం మంచిది. మీ కుటుంబ జీవితంలో  సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందుతారు. 


ధనుస్సు రాశి


ఈ రోజు మీకు ఆదాయ పరంగా మంచి రోజు. మీరు తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటుంంది.  మీ జీవిత భాగస్వామితో జరుగుతున్న వివాదం సమసిపోతుంది. ఉద్యోగులకు కార్యాలయంల గందరగోళం నెలకొంటుంది. విద్యార్థులు చదువుకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 


మకర రాశి 


పెండింగ్‌లో ఉన్న పనులు  పూర్తి చేసే రోజిది. మీ జీవిత భాగస్వామి మీ పనిలో మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే విజయం మీ సొంతం. వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. ఎదురైన చిన్న చిన్న అడ్డంకులను అధగమిస్తారు.  


Also Read: అరుణాచలంలో నిత్యం గిరిప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఎవరు.. ఆమెను చూస్తే భక్తులకు ఎందుకంత పూనకం!


కుంభ రాశి 


అదృష్టం కలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందుతారు. మీరు ఎవరినైతే అతిగా నమ్ముతున్నారో వారే మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తారు. రాజకీయాలవైపు అడుగేసే వారు చేసే పనులపై కొంత శ్రద్ధ వహించాలి...మీరు ఓ మహిళ చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.


మీన రాశి


పాత అనారోగ్య సమస్యలవల్ల బాధపడతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగంలో అనుకూల సమయం. చేసే పనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి...కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. స్నేహితులను కలుసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు...


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.