Sita Navami 2024:  ఏటా వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ రోజే సీతమ్మ జన్మించిందని భావిస్తారు. దీనినే జానకి నవమి అనికూడా అంటారు. శ్రీరామనవమికి శ్రీరాముడి జన్మ కథ చెప్పినట్టుగానే జానకీ నవమి రోజు కూడా సీతమ్మ జన్మదిన కథ గురించి వివరిస్తారు.   ఈ ఏడాది సీతానవమి మే 16 న కొందరు మే 17న కొందరు జరుపుకుంటున్నారు. 


జూన్ 16 గురువారం అష్టమి తిథి ఉదయం 7.19 వరకు ఉంది..తదుపరి నవమి ఘడియలు మొదలయ్యాయి. 
జూన్ 17 శుక్రవారం ఉదయం 8.39 వరకు నవమి ఉంది...


అయితే హిందువుల పండుగల్లో చాలా వరకూ సూర్యోదయానికి తిథి ఉండడమే ప్రధానంగా భావిస్తారు. అయితే నవమి ఘడియలు మే 16 సూర్యోదయానికి లేకపోయినా ఉదయం ఏడున్నర నుంచి రోజంతా తిథి ఉంది. జూన్ 17 శుక్రవారం సూర్యోదయానికి నవమి ఘడియలు ఉన్నప్పటికీ ఉదయం ఎనిమిదిన్నర వరకే ఉంది. దీంతో సీతానవమి విషయంలో కొంత గందరగోళం ఉంది. ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో సీతానమవి మే 16నే జరుపుకుంటున్నారు. 


Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


సీతా నవమి ప్రాముఖ్యత


హిందూ సంప్రదాయంలో శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యత ఉందో సీతానవమి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి రోజు చాలా వైష్ణవ ఆలయాల్లో కళ్యాణాలు జరుగుతాయి. అయితే సీతానవమి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కానీ ఊరువాడ సంబరాలు జరగవు. అయితే సీతానవమి రోజు ఉపవాస నియమాలు పాటించి పూజలు చేసినవారికి భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సీతామాతను పూజిస్తే జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం సీతానవమి పూజ చేస్తారు.  


సీతా నవమి రోజు ఈ కథ చెబుతారు


యజ్ఞఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలానగరంలో తీవ్రమైన కరవు కాటకాలున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాగం చేస్తే ఈ కరవు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనకమహారాజుకి చెప్పాడు ఓ యోగి. అలా యాగం తలపెట్టి భూమిని దున్నతుండగా నాగలి చాలుకి తగిలిన ఓ పెట్టెలోంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు..అంటే తల్లి గర్భంలోంచి జన్మించినది కాదు అని అర్థం. ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులకరించిపోయింది. అప్పటివరకూ కరవుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుసింది. అప్పటి నుంచీ కరవు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు. సీతానవమి రోజు ఈ కథ చెబుతారు పండితులు. 


Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!


సీతాదేవి వ్యక్తిత్వం


క్షమ, దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీతాదేవి. ఆమెలో గుణగణాలు ఎంతో ఆదర్శం. ఆమె పుట్టుక నుంచి  తిరిగి భూమాత ఒడికి చేరేవరకూ రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా ఆదర్శనీయమే. 


@ తండ్రి మాటమేరకు అడవులకు బయలుదేరిన రాముడి అడుగుజాడల్లో నడిచి ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది


@ ఆదరించి అన్నం పెట్టాలనే దయాగుణం ఉండడం వల్లే మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి బిక్షం వేసింది. తన రక్షణ కన్నా దానమే మిన్న అని ఆలోచించి లక్షణరేఖ దాటి వచ్చి కష్టాల్లో పడింది. 


@ లోకుల మాటలు విని మరోసారి తనను అడవులపాలు చేసినప్పటికీ ఒక్కక్షణం కూడా రాముడిపట్ల వ్యతిరేకభావన లేదు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ధీరులుగా తీర్చిదిద్దింది


@ పాతివ్రత్య నిరూపణలో భాగంగా అగ్నిప్రవేశం చేయమని కోరినప్పుడు కూడా...దైర్యంగా అగ్నిప్రవేశం చేసింది. ఆ మాటలు సీతమ్మ గుండెను గాయపరిచినా తాను తప్పుచేయలేదన్న ఆత్మవిశ్వాసం ఆమెను తలెత్తుకునేలా చేసింది 


@ మెట్టినింట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పరిష్కరించుకోవాలి కానీ పుట్టింటివారిని ఇబ్బందిపెట్టకూడదన్న అభిమానవతి సీత. అందుకే వనవాసంలో ఉన్నప్పుడు స్వయంగా తండ్రి జనకుడు వచ్చి తనతో మిథిలా నగరానికి రమ్మని అడిగినా సున్నితంగా తిరస్కరించింది. 


@ జంతు ప్రేమికురాలు అయిన సీతాదేవి ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎంతో ప్రేమ చూపించేది. ఆ ప్రేమతోనే జింకను కోరింది..


@ రావణుజు తనను అపహరించిన తీసుకెళ్లిపోతున్నప్పుడు శోకంలోనే ఉండిపోలేదు..వివేకంతో ఆలోచించింది..ఎలాగూ రావణుడి నుంచి తప్పించుకోలేను కానీ తన జాడకు సంబంధించి రాముడికి ఏదైనా ఆనవాలు ఇవ్వాలనే ఆలోచనతో తన బంగారు నగలను మూట కట్టి నేలపై జారవిడించింది


@ రాముడిపై ఎంత ప్రేమంటే.. రావణుడి చెరలో ఉన్నప్పటికీ నిరంతరం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం భర్తనే స్మరించింది. అపాయంలో ఉన్నప్పుడు కూడా శత్రువుకు లొంగలేదు. ఓ గడ్డిపరకను అడ్డుపెట్టి రావణుడి ధర్మహీనతును ప్రశ్నించింది. 
 
@ రావణుడి చెరనుంచి వెళ్లిపోతున్నప్పుడు..ఆ వనంలో తనని మాటలతో హింసించిన రాక్షసులకు కూడా ఎలాంటి హాని తలపెట్టలేదు. వారంతా స్వామిభక్తితో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆంజనేయుడితో చెప్పిన క్షమాగుణం ఆమెది. 


Also Read: పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు