Daily Horoscope -  రాశిఫలాలు (14-05-2024)


మేష రాశి


ఈ రోజు మేష రాశి వారు కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఆస్తి సంబంధిత వివాదాల నుంచి  ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు కెరీర్‌లో అఖండ విజయాలు సాధిస్తారు. కుటుంబ  బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులలో పనిచేస్తారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఒంటరిగా ఉన్న వ్యక్తుల జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. 


వృషభ రాశి


వృషభ రాశి వారు ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేసుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందలేరు.   మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితం బావుంటుంది


Also Read: చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!


మిథున రాశి


ఈ రోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. గత సమస్యలకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండవచ్చు. అనవసర చర్చల కన్నా కూర్చుని మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం బావుంటుంది. వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. 


కర్కాటక రాశి


ఈ రోజు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు పరిచయాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. జీవితంలో  ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. విద్యార్థులు తన కెరీర్ కి సంబంధించి రిస్క్ తీసుకోవద్దు. వైవాహిక జీవితం బావుంటుంది. 


సింహ రాశి


ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు అందుతాయి.  తీసుకున్న అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. 


Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !


కన్యా రాశి 


పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పని సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. స్నేహితుల సహకారంతో ధనలాభానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభపడతారు. ఆస్తిని అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహించండి.  


తులా రాశి


తులారాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అధిక ఖర్చుల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. ఈరోజు పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభం పొందేందుకు  అవకాశాలు ఉంటాయి.  


వృశ్చిక రాశి


ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.  కెరీర్‌లో విజయం సాధించాలంటే మరింత కష్టపడాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సమస్యలు అలాగే ఉంటాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 


ధనస్సు రాశి


ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు డబ్బు సంబంధిత సమస్యల గురించి ఆందోళనచెందుతారు. పనిచేసే ప్రదేశంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. బంధవులతో కలసి కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. కెరీర్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఆస్తుల కొనుగోలుకు అనుకూలమైన రోజు. కార్యాలయంలో సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి.


Also Read: మే 14న వృషభ రాశిలోకి సూర్యుడు, ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు!


మకర రాశి


ధన ప్రవాహం పెరుగుతుంది. వృత్తి జీవితంలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. పని పట్ల బాధ్యత పెరుగుతుంది. వ్యక్తిగత వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. మీ ప్రియమైన వారితో సమయం గడపండి. కొంతమందికి ఈరోజు ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది.  ప్రేమ జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. 


కుంభ రాశి


ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అన్నదమ్ముల సహకారంతో కెరీర్‌లో ఎదుగుదలకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి  అవకాశాలు పెరుగుతాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. ప్రతి రంగంలో అదృష్టం మీ వైపు ఉంటుంది. భాగస్వామితో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. 


Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!


మీన రాశి 


ఉద్యోగ, వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఐటీ , హెల్త్ కేర్ నిపుణులు విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకునేందుకు సంకోచించవద్దు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.