Sun Transit in Taurus on 14 May 2024: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుని అత్యంత కీలకంగా పరిగణిస్తారు. శని రెండున్నరేళ్లకోసారి ఒక్కో రాశిలో అడుగుపెడతాడు. రాహువు 2024 మొత్తం మీనరాశిలో కేతువు ఈ ఏడాదంతా కన్యా రాశిలో ఉన్నారు. మిలిగిన గ్రహాలైన సూర్యుడు, గురుడు,బధుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు నెలరోజులకోసారి రాశిపరివర్తనం చెందుతారు. మే 14 నుంచి సూర్యుడు వృషభ రాశిలోకి సంక్రమిస్తాడు. జూన్ 15 వరకు సూర్యుడు ఇదే రాశిలో సంచరిస్తాడు. సూర్యుడి స్థానం శుభప్రదంగా ఉంటే ఓ వ్యక్తి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి వృషభ రాశిలోకి సూర్య సంక్రమణం ఏ ఏ రాశులవారికి అదృష్టాన్ని అందిస్తుందో ఇక్కడ తెలుసుకోండి..
మేష రాశి
వృషభరాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు విజయం సాధిస్తారు. గమ్యం చేరుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
Also Read: వార ఫలం - మే 12 నుంచి మే 18 వరకు!
వృషభ రాశి
సూర్యుడి సంచారం వల్ల వృషభ రాశివారికి ఆర్థికంగా ఉండే సమస్యలు తగ్గిపోతాయి. ఆస్తి పెరుగుతుంది. వాహన సౌకర్యం మెరుగుపడుతుంది. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాల వల్ల మీ స్థాయి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీపరీక్షలు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేదుకు ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి
వృషభంలో సూర్యుడి సంచారం కర్కాటక రాశి వారికి కలిసొస్తుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారం చేసేవారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
స్టాక్ మార్కెట్ నుంచి లాభాలు పొందుతారు.
Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!
సింహ రాశి
వృషభంలో సూర్య సంచారం సింహరాశివారికి ప్రయోజనకర ఫలితాలనిస్తుంది. కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలు సమసిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.
వృశ్చిక రాశి
సూర్యుడి రాశి మార్పు వృశ్చిక రాశివారికి మెరుగైన ఫలితాలను అందిస్తోంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో అంచనాలు మించి లాభాలు పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు మంచి సమయం.
Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనేవాళ్లంతా ఇది తెలుసుకోండి!
మకర రాశి
మకర రాశి నుంచి సూర్య సంచారం ఐదో స్థానంలో ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. ఉద్యోగులకు ప్రమోషన్ కి ఛాన్స్ ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సంతానం కోసం చూస్తున్న వారి కల ఫలించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారు మంచి విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ పూర్తవుతాయి.
కుంభ రాశి
వృషభ రాశిలో సూర్యుడి సంచారం కుంభ రాశివారికి కలిసొస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు పనిపట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు, ఉద్యోగులకు మంచి సమయం. వాహనం లేదా స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి నుంచి సూర్యుడు మూడో స్థానంలో సంచరిస్తున్నట్టు. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు సమయం అత్యంత అనుకూలం. శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.