యాదగిరిగుట్టలో యోగనరసింహుడిగా, వేదాద్రి లో లక్ష్మీనరసింహునిగా నరసింహస్వామిని అనేక రూపాల్లో భక్తులు ఆరాధిస్తారు.  దశావతారాల్లో విడి అవతారలైన వరాహ, నరసింహావతారాలు రెండూ కలసి వరాహనరసింహుడిగా కనిపించడం సింహాచల క్షేత్రం ప్రత్యేకత. వరాహ ముఖం, మానవ శరీరం, సింహపు తోకతోకూడిన స్వామివారి శరీరం ఇంకెక్కడా కనిపించదు. బయటనుంచి చూస్తే ఈ ఆలయం ఓ కోటలా ఉంటుంది. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖద్వారం ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే, పడమర ముఖద్వార విజయాన్ని ఒసుగుతుందని  నమ్మకం. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణకు వీలైన మూడు ప్రాకారాలతో, ఐదు ద్వారాలతో నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయంలో కప్ప స్తంభం చాలా ప్రత్యేకం...


Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు


సంతాన గోపాల యంత్రంపై ఉన్న కప్పస్తంభం


శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయంలో ఉన్న ఈ కప్పస్తంభానికి మూల విరాట్‌కి మించిన ప్రఖ్యాతి వుంది. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో ఉంది. సంతానగోపాల యంత్రాన్ని ప్రతిష్టించి పైన కప్ప(పు) స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఈ స్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం కోసం మాత్రమే కాదు మానవ సహజమైన కోర్కెలు కోరుకుని ఈ స్తంభాన్ని ఆలింగన చేసుకుని మొక్కులు చెల్లిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. వాస్తవానికి ఇక్కడ కప్పము( మొక్కుబడులు) చెల్లించినందున కప్పము స్తంభం అని పిలిచేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయిపోయిందన్నమాట. 


Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


ఒక్కో సేవకు ఒక్కో ఉత్సవమూర్తి


ఇక ఇక్కడ ఉత్సవ మూర్తులను షడ్భేరులు అంటారు. ఒక్కొక సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి అన్నమాట. గోవిందరాజులు, కౌతకమూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన అనగా స్నానం చేసే మూర్తి, యోగానంద నరసింహుడు, బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాలు. మూలవిరాట్ మాత్రం వరాహనరసింహ ప్రహ్లాద మందిరం మధ్యలో చందనంపూతతో లింగాకారంలో దర్శనమిస్తారు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. మూల విరాట్ ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉంటారు.ఇక్కడ కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాసోత్సవం, వారోత్సవం, మాసోత్సవం ఎన్నో జరుగుతాయి... వీటిలో చందనోత్సవం ప్రధానమైనది.


Also Read: పర స్త్రీ పై మోజుపడుతున్నారా... అయిదే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే....