దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్. ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు సుదీప్. హీరోగానే కాకుండా.. పాత్ర నచ్చితే ఎలాంటి రోల్ చేయడానికైనా ఒప్పుకుంటారు ఈ హీరో. అందుకే స్టార్ హీరో అయినప్పటికీ 'బాహుబలి', 'సైరా' లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. ప్రస్తుతం సుదీప్ హీరోగా 'విక్రాంత్ రోణ' అనే సినిమా తెరకెక్కుతోంది. 


 పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో 'కేజీఎఫ్2' సినిమాపై ప్రశంసలు కురిపించారు కిచ్చా సుదీప్. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. 


ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారని.. ఈ విషయంలో చిన్న కరెక్షన్ చేయాలనుకుంటున్నా అని చెప్పారు. ఇకపై హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుందని.. తెలుగు, తమిళంలో డబ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. కానీ అవి సక్సెస్ కావడం లేదని.. మనం తీస్తున్న సినిమాలను ప్రపంచం మొత్తం చూస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. మరి సుదీప్ చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి!


Also Read: 'ఆచార్య' టీమ్ వారిద్దరినీ కావాలనే మర్చిపోయిందా?


Also Read: 'హరిహర వీరమల్లు' - ఏ పండక్కి వస్తుందో?