పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు. షూటింగ్ మొదలుపెట్టామని సంతోషపడేలోపే ఇప్పుడు రిలీజ్ డేట్ టెన్షన్ పట్టుకుంది. ఏదైనా పండక్కి సినిమాను విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్. 


ప్రస్తుతం యూనిట్ దసరా, లేదా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. మే, జూన్ నెలల్లో కాల్షీట్స్ అన్నీ ఈ సినిమాకే కేటాయించారు పవన్ కళ్యాణ్. దీంతో ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు దర్శకుడు క్రిష్. కానీ పవన్ తో అనుకున్నట్లుగా షూటింగ్ నిర్వహించలేరు. ఆయన ఎప్పుడు రాజకీయ పనుల్లో మునిగిపోతారో చెప్పలేం.


 మధ్యలో మరో సినిమా మొదలుపెడితే మొదటికే మోసం వస్తుంది. అందుకే రిలీజ్ డేట్ పై కన్ఫ్యూషన్ నెలకొంది. దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు ఆగస్టుకి సినిమా పూర్తయితే.. 'హరిహర వీరమల్లు'సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే. కానీ అప్పటివరకు ఆగితే కొత్త సమస్యలు ఎదురవుతాయి. 


సంక్రాంతికి పోటీ మాములుగా ఉండదు. ఇప్పటినుంచే కొన్ని సినిమాలు సంక్రాంతిపై కన్నేశాయి. అలానే సంక్రాంతి వరకు సినిమాను ఆపితే నిర్మాతకు వడ్డీలు పెరిగిపోతాయి. ఇప్పటికే ఏఎం రత్నం ఆర్థిక కష్టాల్లో ఉన్నారట. ప్రస్తుతానికైతే దర్శకనిర్మాతలు షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 


Also Read: ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, అవమానంగా అనిపించింది - మెగాస్టార్ వ్యాఖ్యలు