మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


ఈ ఈవెంట్ లో చిరంజీవి, రామ్ చరణ్ తమ స్పీచ్ లతో ఆకట్టుకున్నారు. అయితే 'ఆచార్య' ఈవెంట్ మొత్తంలో ఎక్కడా కూడా ఎవరూ.. కాజల్ అగర్వాల్ పేరెత్తలేదు. కనీసం ఆమె సినిమాలో ఉన్నట్లు కూడా ఎవరూ మాట్లాడలేదు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ లలో కూడా కాజల్ కనిపించలేదు. మరోపక్క సోనూసూద్ గురించి కూడా ఎవరూ ఏం చెప్పలేదు. 


ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటించారు. కానీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకనిర్మాతలు కానీ హీరోలు కానీ సోనుసూద్ గురించి మాట్లాడలేదు. సోనూ కూడా ఈ ఈవెంట్ ను ఎందుకో స్కిప్ చేశారు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ ఈవెంట్ లో అందరూ పెద్ద పెద్ద స్పీచ్ లు ఇచ్చినా.. ఎక్కడ కూడా కాజల్, సోనూసూద్ ల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉంది. కొందరైతే కాజల్ సినిమాలో పెద్దగా కనిపించదని.. ఆమెకి సంబంధించిన సన్నివేశాలను చాలావరకు ఎడిటింగ్ లో తీసేశారంటూ మాట్లాడుతున్నారు. టీజర్, ట్రైలర్ లోనే ఆమెని చూపించలేదు. ఇక సినిమాలో ఏ మాత్రం చూపిస్తారో చూడాలి..!


Also Read: చిరంజీవి గారి కంటే నా హీరోనే బెటర్ - రాజమౌళి స్పీచ్ విన్నారా?


Also Read: నాన్నతో అలా ఉండడానికి 13 ఏళ్లు పట్టింది - రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్