Just In

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర కారు డిక్కీలో భాస్కర్.. లక్కీ పుట్టుక రహస్యం చెప్పేస్తాడా!

అమ్మాయి గారు సీరియల్: రూప, రాజులకు యాక్సిడెంట్.. రాఘవని తల్లీకొడుకులు చంపేస్తారా!

ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్లో ఉండదు... కత్తి పట్టడానికీ రెడీ... 'సారంగపాణి జాతకం' హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ

"ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బొండాంలో నాటుమందు.. బాలని చంపాలనుకున్న ఫణి ప్లాన్ పసిగట్టేసిన త్రిపుర

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి తండ్రిని ప్రీప్లాన్డ్‌గా మర్డర్ చేశారు.. లక్ష్మీకి విస్తుపోయే నిజం చెప్పిన రిటైర్డ్ పోలీస్
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Ram Charan: నాన్నతో అలా ఉండడానికి 13 ఏళ్లు పట్టింది - రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్
'ఆచార్య' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ ఏం మాట్లాడారంటే..?
Continues below advertisement

రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అలానే దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, రామజోగయ్య శాస్త్రి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇలా చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా సినిమాలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీగా సాగింది.
ఆ తరువాత రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేశారు. ఈ మెమొరబుల్ ఫిల్మ్ లో నాతో కలిసి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇరవై ఏళ్లుగా మా నాన్నను చూసి నేర్చుకున్నదానికంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. 'ఆర్ఆర్ఆర్' సినిమా సెట్స్ నుంచి నన్ను 'ఆచార్య' సినిమా షూటింగ్ కి పంపించిన రాజమౌళి గారికి ధన్యవాదాలు. మా నాన్నగారితో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో పని చేయాలని రాసి ఉంది. అందుకే ఇంతకముందు ఆయనతో సినిమా కుదరలేదు. శివ గారి రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన రైటింగ్ లో నేను నటించాలనుకున్నాను కానీ నాన్నగారితో కలిసి చేయడం డబుల్ బొనాంజా. ఎంతో ఇష్టంతో ఫ్యాషనేట్ గా చేసిన సినిమా ఇది. నా మనసుకి చాలా దగ్గరైన క్యారెక్టర్ ఇది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమాల్లోకి రాకుండా ఏదైనా బిజినెస్ లోకి వెళ్లి ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించేవాడినేమో కానీ ఇంత మంది అభిమానం, ఇన్ని మంచి సినిమాలు చేసే అవకాశం రాదు. నాన్ కారెప్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సినిమా ఇండస్ట్రీనే. స్కూల్ లో సరిగ్గా చదువుకోలేదు.. ఆచార్యులకు దూరంగా ఉన్నాను. కానీ ఇంట్లో మా ఆచార్య నాకు అన్నీ నేర్పించారు. నన్ను ఎంతో ఎంకరేజ్ చేసే ఫాదర్ కి పుట్టడం బ్లెస్సింగ్. చెడు చెప్పినా కూడా స్వీట్ కోటింగ్ తో చెబుతారు. 20 రోజులు మా నాన్నతో రోజంతా కలిసి ఉన్నాను. కలిసి జాగింగ్ చేశాం.. రైడ్ కి వెళ్లాం. అలా ఉండడానికి నాకు 13 ఏళ్లు పట్టింది. ఆయన చాలా బిజీగా ఉండేవారు. ఉదయం షూటింగ్ కి వెళ్తే సాయంత్రానికి వచ్చేవారు. ఇన్నేళ్లకు ఆయనతో రోజంతా ఉండే ఛాన్స్ వచ్చింది. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. కానీ ఈ ఛాన్స్ నాకు చాలు'' అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.
Also Read:సివిల్ కోర్టు జడ్జ్ మీద కేసుకు వర్మ రెడీ - ఆర్జీవీ వర్సెస్ నట్టి కుమార్ గొడవలో కొత్త ట్విస్ట్
Continues below advertisement
Continues below advertisement