Phishing Scam |ప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ కావడంతో ఆన్‌లైన్ నేరాలు, ఫిషింగ్ స్కామ్‌లు పెరిగిపోయాయి. కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మరీ నేరగాళ్లు వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి నగదు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ఫిషింగ్ స్కామ్‌లో చిక్కుకోవద్దంటూ అప్రమత్తం చేసింది.


KYC అప్‌డేట్‌ల కోసం మీ మొబైల్ ఫోన్లకు వచ్చే ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని తెలిపింది. SBI కస్టమర్లు ఇటీవల ట్విట్టర్ ద్వారా కొన్ని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా SBI స్పందిస్తూ.. ‘‘మా IT భద్రతా బృందం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అనుమానస్పద ఇమెయిల్స్, SMS, కాల్‌లకు స్పందించవద్దని మా ఖాతాదారులందరినీ కోరుతున్నాం. వినియోగదారుడు తమ ID, పాస్‌వర్డ్,  డెబిట్ కార్డ్ నంబర్, PIN, CVV, OTP వంటి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరే ఎంబెడెడ్ లింక్‌లను క్లిక్ చేయొద్దని మనవి. ఈ ప్రశ్నలను బ్యాంక్ ఎప్పుడూ అడగదనే విషయాన్ని గుర్తుంచుకోండి. కస్టమర్‌లు అలాంటి ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ ప్రయత్నాలను ఇమెయిల్ ద్వారా మాకు నివేదించవచ్చు. మీ ఫిర్యాదులను phishing@sbi.co.inకి ఇమెయిల్ పంపండి లేదా 1930కి హాట్‌లైన్‌కి కాల్ చేయండి’’ అని SBI తెలిపింది. 


మోసగాళ్లు ఏ విధంగా కస్టమర్లను మాయ చేస్తారో తెలుపుతూ RBI కూడా ఓ బ్రోచర్‌ను విడుదల చేసింది. ‘‘మోసగాళ్లు వివిధ యాప్‌లు, SMS, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన రుణాలను ఆశ చూపుతూ మోసపూరిత సందేశాలను పంపిస్తారు. విశ్వసనీయత కోసం వారు తమ మొబైల్ నంబర్‌లో ఏదైనా తెలిసిన NBFC ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకుంటారు’’ అని RBI పేర్కొంది. మోసగాళ్లు కస్టమర్లకు కాల్ చేసి, బోగస్ అప్రూవల్ లెటర్స్, మోసపూరిత చెక్కుల కాపీలు, వివిధ రుసుములను డిమాండ్ చేస్తారు. కాబట్టి, అస్సలు మోసపోవద్దని RBI తెలిపింది. ఇటీవల SBI కస్టమర్లు ఇలాంటి స్కామ్‌లకు గురయ్యారని పేర్కొంది. 


Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?


ఈ నెంబర్ల నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయొద్దు: SBI విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. ఈ రెండు నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను అస్సలు ఆన్సర్ చేయొద్దని, ఒక వేళ పొరపాటున సమాధానం ఇస్తే, మీ వ్యక్తిగత.. బ్యాండ్ వివరాలను వారికి చెప్పొద్దని తెలిపింది. +91-8294710946 లేదా +91-7362951973 నెంబర్ల నుంచి వచ్చే కాల్‌లను మోసగాళ్లుగా భావించి కాల్ కట్ చేయాలని సూచించింది. అస్సాం CID  నివేదించిన వివరాల ప్రకారం.. ఆ నెంబర్ల నుంచి కాల్ చేసే మోసగాళ్లు KYC అప్‌డేట్ కోసం ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయాలని కస్టమర్లను కోరుతున్నారని తెలిపింది. కాబట్టి, మీకు బ్యాంక్ నుంచి ఏదైనా కాల్ వస్తే తప్పకుండా తిరస్కరించండి. వారి వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడండి. 


Also Read: ఓ మై గాడ్, కారు ఢీకోగానే గాల్లో పల్టీలు కొట్టిన బైకర్, వీడియో వైరల్