Shri Raghavendra Swami Temple: హిందూమత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఓ గురువుగా రాఘవేంద్రస్వామిని భావిస్తారు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబిస్తూ  తమిళనాడు కుంభకోణంలో మధ్వమఠాన్ని కొంతకాలం పాలించి..ఆ తర్వాత మంత్రాలయంలో మఠాన్ని స్థాపించి..ఇక్కడే జీవ సమాధి పొందారు. 


తమిళనాడు భువనగిరిలో తిమ్మణ్ణభట్టు  -  గోపికాంబ అనే కన్నడ భట్టు రాజులు రెండో సంతానంగా 1595లో జన్మించారు. వేంకటేశ్వర స్వామి   అనుగ్రహంతో పుట్టినందుకు చిన్నప్పటి నుంచీ వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక కుంభకోణం శ్రీ మఠంలో విద్యను అభ్యసించారు. మధురై నుంచి తిరిగి వచ్చిన తర్వాత సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది. వీరి సంతానమే లక్ష్మీనారాయణాచార్య . ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుని శ్రీమఠంలో సుధీంద్రతీర్థుల వద్ద విద్యను అభ్యసించారు. వేదశాస్త్రాల్లో నైపుణ్యం సాధించి ఇతరులకు బోధించడం ప్రారంభించారు. గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి దక్షిణ భారతదేశం మొత్తం ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.


Also Read: జుట్టుతో ఒళ్లంతా కప్పుకునే అమ్మవారి గురించి తెలుసా!


అప్పటి నవాబు ఒకరు రాఘవేంద్రస్వామిని పరీక్షించేందుకు బుట్టలతో మాంసం పంపాడు. అయితే ఆ బుట్టలు తెరిచి చూసేసరికి అందులో పూలు పళ్లు కనిపించాయి. ఆ తర్వాత మృతిచెందిన ఓ బాలుడిని తిరిగి బతికించి తనలో మహిమను చాటిచెప్పారు రాఘవేంద్రుడు. పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి అయిన తర్వాత  శిష్యుడైన వెంకన్నను పిలిచి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరారు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య కార్యాలు పూర్తిచేసుకుని చేతిలో వీణపట్టుకుని సమాధిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. 23ఏళ్ల వయసులో సన్యాస దీక్ష తీసుకున్న రాఘవేంద్రస్వామి..40 ఏళ్ల పాటూ నియమ నిష్టలతో గడిపిన జీవితం, సాధించిన విజయాలు , జరిగిన సంఘటనల గురించి.. వారి సోదరి కుమారుడు నారాయణాచారి రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో ప్రస్తావించారు. 


Also Read: ఇంకా పెళ్లికాలేదా - అయితే ఇక్కడకు వెళ్లొస్తే ఓ ఇంటివారైపోతారు!


శిష్యుడికోసం
రాఘవేంద్రస్వామి ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవతి తీరం నుంచి పరిగెత్తుకుని వచ్చేసమయానికే గురువుగారు సమాధిలోకి చేరుకున్నారు. అప్పణాచార్యులు  కన్నీళ్లతో దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో చివరి ఏడు అక్షరాలు చెప్పలేకపోయాడు..ఆ సమయంలో శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ అక్షరాలు సమాధిలోంచి వినిపించాయి. ఆ శ్లోకాన్ని ఇప్పటికీ బృందావనంలో జరిగే ప్రార్థనల్లో పఠిస్తారు. 


మంచాల గ్రామమే మంత్రాలయం
రాఘవేంద్రస్వామి.. తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక' అనే గ్రంథానికి ‘ప్రకాశం' అనే వివరణ రాశారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక' సుధ, పరిమళ అనే గ్రంథాలు రచించారు. ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు చేశారని చెబుతారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామమే మంత్రాలయంగా వెలుగుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే భగవంతుడిగా, సాహితీవేత్తగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై ఉన్నాడు. శ్రీ గురు రాఘవేంద్రుల వారిని స్మరిస్తూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి.  


Also Read: అమ్మవారి దంతాలు పడిన ప్రదేశం - తెలంగాణలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సి శక్తిపీఠం!


పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే


ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః