Love Me Release Trailer: 'రౌడీ బాయ్స్'‌ ఫేం ఆశిష్‌, బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లు నటిస్తున్న సినిమా 'లవ్‌ మీ'. ఇఫ్‌ యు డేర్‌ అనేది ఉపశీర్షిక. రేపు (మే 25) ఈ మూవీ థియేటర్లో విడుదల కాబోతుంది. రిలీజ్‌కు ఒక్క రోజు ముందు మూవీ టీం రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ మూవీపై ఆసక్తి పెంచుతుంది. ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్లో హీరో వెనక దెయ్యం పడుతున్నట్టుగా చూపించారు. కానీ తాజాగా రిలీజ్‌ చేసిన ఈ ట్రైలర్లో ట్విస్ట్‌ ఇచ్చింది మూవీ టీం. నిజానికి హీరోనే దెయ్యం ప్రేమలో పడతాడు.


ఆ దెయ్యాన్ని చూసిన ఎవరైనా చచ్చిపోతారట. కానీ హీరో ఆ దెయ్యాన్ని లవ్‌ చేయడం, తనతో డేటింగ్‌, రొమాన్స్‌ కూడా చేసినట్టు తాజాగా రిలీజైన ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోని లవ్‌ చేస్తుంది. కానీ హీరో మాత్రం దెయ్యంతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోతాడు. ఈ తాజా ట్రైలర్‌లో దెయ్యం విజువల్స్‌ని క్లియర్‌గా చూపించారు. కానీ ఆ దెయ్యం ఎవరూ ఎందుకు హీరో కంటనే పడిందనే అంశాలు మాత్రం ఆసక్తిని పెంచుతున్నాయి. పైగా దెయ్యం పేరును కూడా ఈ ట్రైలర్‌లో రివీల్‌ చేశారు. ఆమె పేరు దివ్వవతి. 



అయితే ట్రైలర్‌ మధ్యలో'తనని చూసిన ఎవ్వరైనా చంపేస్తుంది తను.. కానీ నువ్వు తనని చూసి కానీ చావను అంటున్నావు. ఏం రిలేషన్‌ ఇది' అని హీరోయిన్ చెప్పే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఇక అసలు ఏ ఎమోషన్స్‌ లేని హీరో దెయ్యంతో ప్రేమలో పడటం, తనకి ఎమోషనల్‌ కనెక్ట్‌ అవ్వడం వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్‌ రిలీజ్‌ చేసి మూవీపై క్యూరియాసిటి పెంచారు మేకర్స్‌. మొత్తానికి హారర్‌ అంశాలతో రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ అద్యాంతం ఆసక్తిని పెంచుతుంది. హీరోయిన్‌ని కాదని హీరో దెయ్యాన్ని ప్రేమించడం వంటి సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈసినిమాకు అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు.


శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ఆశిష్‌, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్‌ చౌదరి, బిగ్‌బాస్‌ రవిక్రష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక విపరీతమైన దైవ భక్తి ఉన్న ఈ హీరో దెయ్యంతో ప్రేమలో పడటం, దానితోనే కొంతకాలంగా అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉండటం వంటి అంశాలు మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. పైగా హీరో ఆమె అసలు చనిపోలేదని చెప్పడం ట్రైలర్‌లో హైలెట్ అని చెప్పాలి. 'లవ్ మీ' చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలోని ఓ పాటను ఏఐ టెక్నాలజీ ద్వారా పాడించడం మరో విశేషం. ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ వంటి స్టార్ సినిమాటోగ్రాఫర్‌ వర్క్ చేస్తున్నారు.