Karate Kalyan Comments on Actress Hema Drug Case: బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. ఈ కేసులో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు తాజా నివేధికల్లో వెల్లడైనట్టు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) అధికారులు తెలిపారు. ఈ రేవ్ పార్టీలో మొత్తం 130 మంది పాల్గొంటే వారిలో 86 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్టు ఎన్‌సీపీ తెలిపింది. వారందరికి నోటీసులు పంపనున్నట్టు సమాచారం. ఇక పాజిటివ్‌గా తేలిని వారి నటి హేమ, మరో నటి ఆషి రాయ్‌లు కూడా ఉన్నారు. ఇక ఈ రేవ్ పార్టీలో వ్యవహరం వెలుగులోకి రాగానే నటి హేమ చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది.
అంతేకాదు ఇంట్లో బిర్యానీ వండుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. తాజాగా తన రక్తనమూనాలో డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లవ్వడంతో అంతా హేమ తీరుపై చర్చించుకుంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో దొరికన హేమపై నటి కరాటే కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక నీ దొంగ నాటకాలు ఆపు హేమ, నిన్ను రేవ్ పార్టీలో ఆరెస్ట్ చేసినట్టు బెంగుళూరు పొలీసులు స్పష్టం చేశారంటూ ఆమెకు చురకలు అట్టించింది. తాజాగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్టు స్పష్టం కావడంతో కరాటే కళ్యాణ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఆమె ఏబీపీ దేశం చానల్‌తో మాట్లాడారు. హేమ డ్రగ్స్ తీసుకోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
ఇక హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది..మరి ఆమెపై మా అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై కరాటే కళ్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. "మా అసోషియేన్ నిబంధనల ప్రకారం అయితే ఆమె దోషి అని తేలితే మాత్రం శిక్షిస్తారు. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారా? అనేది మా అసోసియేషన్ నిర్ణయం. డిసిప్లేనరి కమిటీతో మాట్లాడి 'మా' అధ్యక్షుడు నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్‌లో ఉన్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టెవల్ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ ఉన్నారు. ఆయన వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియదు. ఈ కేసులో ఆమె దోషి? నిర్దోషి అని తేలేవరకు హేమను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అది నా అభిప్రాయం మాత్రమే. 'మా' అధ్యక్షుడు లేకుండా నేను ఏం చెప్పలేను. మాట్లాడోద్దు కూడా" అంటూ కరాటే కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఇండస్ట్రీ నుంచి చందు కుటుంబానికి ఆర్థిక సాయం.. అసలు విషయం చెప్పిన టీవీ నటి నీరజ!
కాగా ఈ నెల 19న రాత్రి బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో రేవ్ పార్టీని నిర్వహించారు. స్థానిక జీఆర్ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించినట్లుగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) నుంచి సమాచారం. ఈ పార్టీలో డీజే సౌండ్ కారణంగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ లభ్యంకావడంతో ఈ పార్టీకి హాజరైన వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి రక్త నమునాలు సేకరించారు. అంతేకాదు ఇందులో టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, టీవీ నటులు సహా, మోడల్స్, పలువురు వ్యాపార, రాజకీయ వారసులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.