Kajal's Satyabhama Release Date: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'సత్యభామ'. ఇప్పటి వరకు తనను చందమామగా చూసిన ప్రేక్షకులకు తన మాస్ యాంగిల్ చూపించడానికి రెడీ అవుతోందీ ముద్దుగుమ్మ. తొలుత ఈ సినిమాను మే 17న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. తర్వాత మరోసారి వాయిదా పడింది. మే 31కి వెళ్లింది. ఆ రోజు కూడా ఈ మూవీ రిలీజ్ కావడం లేదు. వాయిదా పడింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ఏమిటంటే...


జూన్ 7న కాజల్ 'సత్యభామ' విడుదల
Satyabhama New Release Date: కదనరంగంలో 'క్వీన్ ఆఫ్ మాసెస్' ఒంటరిగా నిలబడుతుందంటూ చిత్ర నిర్మాణ సంస్థ అవురమ్ ఆర్ట్స్ పేర్కొంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. మే 31న విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో పాటు కార్తీక్ గుమ్మకొండ 'భజే వాయు వేగం', ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ హీరోగా నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' కూడా ఉంది. అందుకని, జూన్ 7న విడుదల చేయాలని కాజల్ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు.


Also Read: మలయాళ సినిమా టర్బో రివ్యూ: మమ్ముట్టి యాక్షన్ కామెడీ ఎలా ఉందంటే?






'సత్యభామ' కోసం 'భగవంత్ కేసరి'!
Satyabhama Movie Trailer: 'సత్యభామ' సినిమా ట్రైలర్ మే 24వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఆ వేడుకకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నారు. 'భగవంత్ కేసరి'లో ఆయనకు జోడీగా కాజల్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సత్యభామ కోసం ఆ కేసరి రానున్నారు. మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేసినట్టు టాక్.


Also Read: మూడు రోజులు... రోజుకు ఐదు గంటలు... బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ కష్టం!






'మేజర్' డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పణలో తెరకెక్కిన 'సత్యభామ'కు సుమన్ చిక్కాల దర్శకుడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ప్రొడ్యూసర్లు. కళ్ళ ముందు, తన చేతుల్లో ప్రాణాలు వదిలిన అమ్మాయి మరణం వెనుక ఎవరున్నారు? ఆ హంతకులను సత్యభామ ఎలా పట్టుకుంది? - ఇదీ సినిమా కథ.



కాజల్ అగర్వాల్ జోడీగా అమరేందర్ అనే కీలక పాత్రలో నవీన్ చంద్ర నటించిన 'సత్యభామ'లో ప్రకాష్ రాజ్ ఓ ప్రధాన పాత్రధారి. ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్: అవురమ్ ఆర్ట్స్, స్క్రీన్ ప్లే - ప్రజెంటర్: శశి కిరణ్ తిక్క, ప్రొడ్యూసర్లు: బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత: బాలాజీ, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల.