Shravana Masam 2024: శ్రావణం నెలరోజులూ ప్రతిరోజూ ప్రత్యేకమే. సోమవారం శివుడికి, మంగళవారం మంగళగౌరికి, శుక్రవారం వరలక్ష్మీఅమ్మవారికి, శనివారం ఇంటి ఇలవేల్పుఅయిన దేవుడికి పూజలు నిర్వహిస్తుంటారు. పండుగల సందడి సరే..శ్రావణం అంటేనే నెల రోజులూ ప్రత్యేకమే అని ఎందుకంటారు.  ఈ సమయంలో వ్రతాలు ఎందుకు చేస్తారు? ఈ వ్రతాలవల్ల మహిళలకు కలిగే ప్రయోజనాలేంటి? ఈ విషయాలన్నీ ఏబీపీదేశంతో పండితులు రఘురామ శర్మ వివరించారు..


Also Read:  ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!


హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసంగా చెబుతారు. ఈ మాసంలో ఎక్కువగా నోములు, పూజలు, వ్రతాలు,ఉపవాసాలు చేస్తారు. పురాణాల ప్రకారం లోకాలను ఏలే మహాశివుడు కి అత్యంత ప్రీతి కరమైన మాసం శ్రావణం. శ్రీమహావిష్ణు ఈ నాలుగు మాసాలు ప్రజల శ్రేయస్సు కోరి పవళింపు సేవలో ఉన్నప్పుడు ఈ లోకాలను ఏలే బాధ్యత అమ్మవారికి అప్పగిస్తాడు..అందుకే ఈ శ్రావణమాసంలో అమ్మవారిని పూజించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయి .


శ్రావణ సోమవారం,శ్రావణ మంగళవారం,శ్రావణ శుక్రవారం,శ్రావణ శనివారం...నిత్యం ప్రత్యేక పూజలు, ఉపవాసాలే, అమ్మవారికి విభిన్న నైవేద్యాలే. వర్షాలు అధికంగా కురిసే ఈ నెలలో వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఈనెలలో దీక్షలు, ఉపవాసాలు చేస్తారు. ఉపవాస దీక్ష అంటే పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండకూడదు...  అల్పాహారాన్ని తీసుకుంటూ  అమ్మవారి నామస్మరణలో ఉండాలి.  సంవత్సరమంతా ఉపవాసాలు చేయలేని వారు శ్రావణమాసంలో ఉపవాసాలు ఉంటే  ఆరోగ్యానికి కూడా మంచిదని ఈ మాసం మొత్తం  దైవ భక్తులకు అందరికీ పండగ మాసమని అంటున్నారు.


Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!


హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణంలో మాంసాహారం నిషేధం. చాలా మంది ఈ నెల మొత్తం మాంసాహారం తినరు. నెలంతా రోజుకో పూజలో మునిగితేలడం ఓ కారణం అయితే..వాతావరణంలో వచ్చే మార్పులు, భూమ్మీద సూర్యకిరణాల వేడి తక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంటుంది. పైగా వర్షాల కారణంగా అంటు వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలుతూ ఉంటాయి. ఈ సమయంలో మాంసాహారం తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రావణంలో మాంసాహారానికి దూరంగా ఉండడానికి కారణం ఇదొకటి.  


శ్రీ మహాలక్ష్మ్యష్టకం
 
ఇంద్ర ఉవాచ |
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 


సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే || 


ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తే మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే ||  


మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||  


ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్ |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||  


త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనమ్ |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ||  


ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ ||


Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!