Why Sarpa Samskara Pooja is Done: పాములకి హాని కలిగించడం లేదా ప్రమాదవశాత్తూ కానీ ఉద్దేశపూర్వకంగా కానీ వాటిని చంపడం వల్ల సర్పదోషం అంటుకుంటుంది. ఈ కర్మ ఒకటి రెండు తరాలు కాదు..ఏకంగా ఏడు తరాలను పట్టిపీడిస్తుంది. కొందరికి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉంటుంది. ఈ దోషం ఉండే జాతకుడికి దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్రపండితులు. మొత్తం ఏడు గ్రహాలు రాహువు - కేతువుల మధ్య ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. కాల సర్ప దోషం కింద జన్మించిన వ్యక్తికి చింతలు, అభద్రత, మరణ భయం , నిరంత విపత్తులు...ఇలా ఏదో ఒకటి బాధపెడుతూనే ఉంటుంది. ఇంకా...ఆలస్యం వివాహం, గర్భం దాల్చడంలో జాప్యం, చర్మ వ్యాధులు, ఆర్థిక వృద్ధికి ఆటంకాలు, కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కో అవయవంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి దోషాలతో బాధపడేవారికోసమే శాస్త్రంలో సర్ప సంస్కార పూజను సూచించారు.
Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!
సర్ప సంస్కార పూజ!
సర్ప సంస్కార పూజ అనేది నాగదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే అత్యంత శక్తివంతమైన పూజ. పాములను చంపిన వారు మాత్రమే కాదు, పాములను కొట్టేవారు, బంధించేవారు, వాటిని హింసించేవారు కూడా చేయించుకోవాలి. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్నవారు, సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా సర్ప సంస్కార పూజ నిర్వహిస్తే మంచిది.
సర్ప సంస్కార పూజ ఎలా చేస్తారు?
అసలు ఓ జీవిని చంపినందుకు బాధపడడమే సగం పాప పరిహారం..మరి పూర్తిగా ఆ దోషం నుంచి నివారణ లభించాలంటే భవిష్యత్ లో మళ్లీ అలాంటి తప్పు చేయకుండా ఉండాలి. మరో ప్రాయశ్చిత్తం... సర్ప సంస్కార పూజ... దీనిని కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో, ప్రసన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో చేస్తారు. ఓ మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో...అలానే మీరు చంపిన పాములకు కూడా అంతిమ సంస్కారాలు చేయిస్తారు. దర్భలు కానీ వేరే పదార్థాలతో కానీ సర్పాన్ని తయారు చేసి ఈ సంస్కారాన్ని చేయిస్తారు అక్కడుండే పూజారులు. ఇది పాటించిన తర్వాత కొన్ని రోజులు అసౌచాన్ని పాటించాలి..ఎందుకు, ఏంటి, ఎన్నిరోజులు అసౌచాన్ని పాటించాలన్నది అక్కడ మీతో పూజ చేయించిన వారు వివరిస్తారు.
Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
హిందూ ధర్మ గ్రంధాలు ప్రకారం ఎవరైనా కానీ..... చనిపోయిన పాము, కోతి , ఇతర జంతువులను చూసినప్పుడు వాటికి దహనసంస్కారాలు నిర్వహించాలి..లేదంటే చూసి అలా వెళ్లిపోయిన వారికి కూడా దోషం వెంటాడుతుంది. ముఖ్యంగా చనిపోయిన నాగుపాము కనిపిస్తే మాత్రం దానిని బ్రాహ్మణుడిగా భావించి దహన సంస్కారాలు నిర్వహించాలి. వీటిని నిర్వహించిన తర్వాత పది రోజుల పాటూ సూతకం పాటిస్తారు.
ఏ జీవినీ చంపేహక్కు మనకు లేదు.. మనకు ప్రాణాంతకం అయితే తప్పదు కానీ అప్పుడు కూడా పరిహారం చేసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా
నాగుపాము, గోవు లాంటివి...జన్మల పరంపరలో మానవుడికి దగ్గరగా ఉన్న జన్మలు.. వాటిని చంపితే మనిషిని చంపినట్టే... అందుకే శాస్త్రంలో ఇలాంటివాటి జోలికి అస్సలు వెళ్లొద్దని చెబుతారు.
సర్ప సంస్కార పూజా వల్ల ప్రయోజనాలు
- నాగదోష సంహారం నుంచి ఉపశమనం పొందుతారు
- కెరీర్లో వృద్ధి ఉంటుంది
- వాహంలో జాప్యం జరిగితే నివారణగా ఈ పూజ చేయొచ్చు
- సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి
కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకునేందుకు బెంగుళూరు నుంచి KSRTC కుక్కేకి నేరుగా బస్సులు నడుపుతోంది. బెంగళూరు నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరే బస్సు తెల్లవారుజామున కుక్కే ఆలయానికి చేరుకుంటుంది. ఇంకా ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మంగళూరు-బెంగళూరు మార్గంలో సుబ్రమణ్య రోడ్ రైల్వే స్టేషన్ ఉంది..ఇక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సర్ప సంస్కార పూజ కేవలం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మాత్రమే కాదు...చాలా ఆలయాల్లో నిర్వహిస్తారు..ఏ ఏ ఆలయాల్లో ఈ పూజ చేస్తారో ఆ వివరాలు మరో కథనంలో తెలుసుకుందాం...
Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!