Shani Trayodashi 2024: నవగ్రహాలలో ఒకరైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవి కుమారుడు. మనిషి చేసే  పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను  నియంత్రిస్తాడు శని. శని-యముడు సోదరులు. బతికి ఉండగా చేసే పాపపుణ్యాలను శని పరిగణలోకి తీసుని న్యాయమూర్తిగా  వ్యవహరిస్తే.. మనిషి మరణానంతరం వారి పాపపుణ్యాల ఆధారంగా శిక్షలు విధిస్తాడు శని సోదరుడు యమ ధర్మరాజు. ప్రతి శనివారం తలకు స్నానం ఆచరించి శనిని పూజించినా, తైలంతో అభిషేకం చేసినా, నల్లని వస్త్రంలో నువ్వులు దానం చేసినా శనిదోషం తగ్గుతుందని చెబుతారు. మరీ ముఖ్యంగా శనివారం - శని త్రయోదశి కలసి వస్తే మరింత పవర్ ఫుల్. మార్చి 23 శనివారం మొత్తం త్రయోదశి తిథి లేకపోయినా సూర్యోదయ సమయానికి త్రయోదశి ఉండడంతో..ఈ రోజు శని త్రయోదశి అయింది. ఈ రోదజు శనిని ప్రశన్నం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి.. ఈ శ్లోకాలు చదువుకుంటే శని కొంత ఉపశమనం లభిస్తుంటారు పండితులు..


Also Read: మీపై శని ప్రభావం ఉందో లేదో తెలుసుకోవడం ఎలా, ఉంటే ఏం చేయాలి!


శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలివే
సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించేవారు రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి. ఈ రోజు మాంసాహారానికి దూరంగా ఉండాలి. శివార్చన, ఆంజనేయ ఆరాధన వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. అన్నదానం చేయడం, మూగ జీవాలకు నీళ్లు,ఆహారం అందిస్తే శుభం జరుగుతుంది. శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయంలో శనికి అభిషేకం చేయండి, శివాలయంలో ప్రసాదం పంచండి. ముఖ్యంగా శనివారం రోజు రొట్టెలపై నువ్వులు వేసి కుక్కకు పెడితే శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు. నదిలో కానీ పారే మంచినీటి కాలువలో కానీ బొగ్గులు, నల్లనువ్వులు, మేకు వేసి శనికి నమస్కరించినా, చీమలకు పంచదార పెట్టినా శని ప్రభావం తగ్గుతుంది. శని త్రయోదశి రోజు మాత్రమే కాదు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ ప్రదిక్షిణలు చేయడం అత్యుత్తమం. 


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


శని శ్లోకాలు


నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం!!


ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః 
కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ: 
సౌరి శనైశ్చరో మంద: 
పిప్పలాదేవ సంస్తుత: 


నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం 


ఓం  సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: 
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని


శని గాయత్రీ మంత్రం
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. 
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ 


Also Read: మీ బెడ్ రూమ్ లో అద్దం ఎటువైపు ఉంది, మంచం ఏ దిక్కున గోడకు వేశారు!


శని షోడశ నామాలు  
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః 
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః 
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః 
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః 
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే 
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే 


శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే


Also Read: ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నా ఈ ఉగాది నుంచి తిరుగులేదంతే - శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు!


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం