Shani Upay:  ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. మందగమనం( నెమ్మదిగా నడిచేవాడు) కలిగినవాడైనందున శనైశ్వరుడు అంటారు. నవగ్రహాల్లో అతి శక్తిమంతుడైన శని వాహనం కాకి. మకర, కుంభ రాశులకు అధిపతి శని. శనైశ్వరుని భార్య జ్యేష్టాదేవి. అయితే శని శ్రమకారకుడు అని, కష్టపడితే ప్రభావం తక్కువ చూపిస్తాడని అంటారు. ముఖ్యంగా చీమలకు పంచదార వేసినా, ఎక్కువగా నడిచినా శని బాధల నుంచి కొంతవరకూ విముక్తి లభిస్తుందంటారు. ఇంతకీ చీమలకు-శనికి ఏంటి సంబంధం.


Also Read: ఏప్రిల్ 29 రాశిఫలాలు, ఈ రాశివారు లాభాలకోసం తాపత్రయపడి ఉచ్చులో చిక్కుకోవద్దు


శని ఉందని ఎలా తెలుస్తుంది



  • గోచారరీత్యా శని మేషం నుంచి మీన రాశివరకూ సంచరిస్తాడు..12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఇలా ఉంటాయి.

  • జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని దీనిని ఏలినాటి శని అని వ్యవహరిస్తారు

  • 12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు

  • జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు.

  • రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళనలు


జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. 


జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.


Also Read: మీ బెడ్ రూమ్ లో అద్దం ఎటువైపు ఉంది, మంచం ఏ దిక్కున గోడకు వేశారు!


అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి నాలుగువ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.స్ధాన చలనం,స్ధిరాస్తి సమస్యలు,వాహన ప్రమాదాలు,తల్లికి అనారోగ్యం కలుగుతాయి.


అష్టమ శని
జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడొకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.శత్రు బాదలు,ఊహించని నష్టాలు వస్తాయి.


దశమ శని
జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.


అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు , గోచారం లో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు వాకింగ్ చేయడం, యోగా చేయడం, శ్రమ కారక జీవులైన చీమలకు పంచదార గాని,తేనే గాని వెయ్యటం వల్ల కూడా శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది.


చీమలకు పంచదార వేస్తే శని ప్రభావం ఎందుకు తగ్గుతుంది. 
చీమలు...ఐకమత్యానికి నిదర్శనం. ఒకే పుట్టలో కలిసి ఉండడమే కాదు, వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. అందుకే శ్రమైక జీవనానికి నిదర్శనమైన చీమలకు ఆహారం వేస్తే శని భాదలనుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్రపండితులు


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.