Vastu Shastra Tips for Home : వాస్తు కొందరికి సెంటిమెంట్ మరికొందరికి ట్రాష్. అస్సలు పట్టించుకోనివారికి సమస్యే లేదు కానీ వాస్తుని విశ్వశించేవారు మాత్రం ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలిస్తారు. వాస్తు ప్రకారం ఇది సరికాదని తెలిస్తే చాలు ఎలాంటి మార్పులు చేర్పులైనా చేసేస్తారు. ఇంటి నిర్మాణం సమయంలో మొదలైన వాస్తు..ఇంట్లో వస్తువులు సర్దుకునే వరకూ ఉంటుంది. ముఖ్యంగా పడక గది విషయంలో వాస్తు చాలా నియమాలను తెలియజేసింది. కొన్ని నియమాలను పట్టించుకున్నా లేకపోయినా కొన్ని విషయాలను మాత్రం తప్పకుండా పాటించాలి. అలా పాటించినప్పుడే కుటుంబ వాతావరణం, దంపతుల మధ్య ఆప్యాయత ఉంటుంది. బెడ్‌రూమ్‌లో నిర్మాణం దగ్గర్నుంచి లోపల అమరిక ఎలా ఉండాలన్నదానివరకూ జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాస్తు శాస్త్ర నిపుణులు


Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే



  • ఇంటిలో మెయిన్ బెడ్‌రూమ్‌ నైరుతీమూలన ఏర్పాటు చేసుకోవాలి

  • పడక గదిలో బుక్‌ షెల్ఫులు, డ్రసింగ్‌ టేబుల్స్‌...ఇవన్నీ పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి

  • చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆకారంలోనే బెడ్‌రూమ్‌ల నిర్మాణం జరగాలి కానీ రకరకాల షేపుల్లో బెడ్ రూమ్ నిర్మాణం ఉండకూడదు

  • పడక గది డోర్‌ మినిమం 90 డిగ్రీలు అయినా తెరచుకునేలా ఏర్పాటు చుసుకోవాలి

  • పడక గదిలో అద్దం లేకపోవడం మంచిది..ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు

  • ఎప్పుడూ కూడా అద్దం చూస్తూ నిద్రలేవకూడదు...మీరు నిద్రపోతున్నప్పుడు అద్దం మీ ఎదురుగా ఉండి చూసేలా ఏర్పాటు చేయకూడదు. ఇలా చేస్తే అపశకునం, అనారోగ్యం అని చెబుతారు వాస్తు పండితులు

  • చాలామంది మంచానికి షెల్పులు చేయించుకుంటారు...షెల్పులు ఉన్నాయికదా అని చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తువులు, వినియోగించని దుస్తులు అందులో కుక్కేస్తారు..కానీ అది పాతసామాన్లు పెట్టే చోటుకాదని గుర్తించాలంటారు వాస్తు పండితులు

  • పాత పనికిరాని సామన్లను పడక గదిలో బెడ్‌ దిగువకు నెట్టడం కూడా వాస్తురీత్యా మంచిది కాదు. మంచం కింద చెత్తా చెదారం ఉంటే మీకు ప్రశాంతమైన నిద్ర ఉండదు

  • అక్వేరియం ఎంత అందమైనది అయినా..మీకెంత ముచ్చట ఉన్నా పడకగదిలో అస్సలు ఉంచకూడదు

  • పడక గదిలో నిద్ర లేవగానే చూసి నమస్కరించుకునేందుకు దేవుళ్ల ఫొటోలు పెడతారు..కానీ వాస్తురీత్యా ఇది కూడా మంచిది కాదు. పడకగదిలో దేవుళ్ల ఫొటోలు ఎప్పుడూ ఉండకూడదు.

  • ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యజమానే వాడుకోవాలి కానీ పిల్లలకోసం, గెస్టు రూమ్ లా , ఇతరత్రా అవసరాల కోసం ఉంచకూడదు

  • పడక గదిలో బెడ్‌ ఎప్పుడూ దక్షిణం, పడమర గోడలకు ఆనుకుని కానీ ఆ దిక్కులవైపున్న గోడలకు చేరువగా కానీ ఉండాలి

  • అల్మరాలు, ఇనుప బీరువాలు... బెడ్‌రూమ్‌లో దక్షిణం లేదా పడమర గోడకు ఆనుకుని ఉండేలా అమర్చుకోవాలి

  • పడక గదిలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంచరాదు. ఫోన్‌, టీవీలను కూడా బెడ్ రూమ్ లో పెట్టుకోరాదు

  • పడకగది డోర్‌కు ఎదురుగా బెడ్‌ కనిపించకూడదు

  • డబల్‌ బెడ్‌ అయినప్పటికీ.. దానిపై సింగిల్‌ మేట్రెస్‌ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు అస్సలు వేయకూడదు


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.