Greater Noida Private University:


నోయిడాలోని యూనివర్సిటీలో 


సోషల్ మీడియాలో స్టూడెంట్స్ కొట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఇది జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు గొడవ పడ్డారు. అయితే...ఇందుకు కారణమేంటన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా తేలలేదు. దంకౌర్ పోలీస్ట్ స్టేషన్‌లో ఈ ఘర్షణపై యూనివర్సిటీ యాజమాన్యం కంప్లెయింట్ చేసింది. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ఇది ఎప్పుడు జరిగిందన్నది తేలకపోయినా...ఇలాంటివి సహించేదే లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి  విచారణ కొనసాగుతోంది.