Secundrabad Ujjaini Mahankali Bonalu 2024 : ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢంలో వచ్చే ప్రతి గురువారం, ఆదివారం బోనాల జాతర జరుగుతుంది. జూలై 21 ఆదివారం ఉజ్జయని మహంకాళి బోనాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు ఆలయ సిబ్బంది. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 21,22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి  2 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.  


Also Read: మహానుభావుల సందేశాలు, ఈ శ్లోకాలతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయండి!


రైల్వే స్టేషన్ కి వెళ్లే ప్రయాణికుల కోసం


ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను పోలీసులు ముందుగానే అప్రమత్తం చేశారు పోలీసులు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1కి బదులుగా ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 నుంచి స్టేషన్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్‌పురా వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్నారు.


మూసేస్తున్న రోడ్లు ఇవే


టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్
బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కు రోడ్ క్లోజ్ చేస్తారు
జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్ , ఆద‌య్య ఎక్స్ రోడ్ మూసివేస్తారు


Also Read: పురాణాల్లో ఉపాధ్యాయ దినోత్సవం..గురుపౌర్ణమి ( జూలై 21) విశిష్టత ఇదే!


పార్కింగ్ కోసం


జాతరకు వచ్చే వారి కోసం... హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజ్, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గవర్నమెంట్ అదయ్య మెమోరియల్ హై స్కూల్, అదయ్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మహాత్మా గాంధీ విగ్రహం, MG రోడ్, బెల్సన్ తాజ్ హోటల్, అంజలి థియేటర్, పరేడ్ గ్రౌండ్ లో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. 
 
ట్రాఫిక్ మళ్లిస్తున్న మార్గాలివే...


సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాల్సిన RTC బస్సులు చిలకలగూడ ఎక్స్‌ రోడ్డు మీదుగా గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్డు, కవాడిగూడ, మారియట్‌ హోటల్‌ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులు  బేగంపేట నుంచి క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్డు, ఎస్‌బీఐ ఎక్స్‌ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వచ్చే వాహనాలను సజ్జనల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మళ్లించనున్నారు.  SBI ఎక్స్‌ రోడ్డు నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను ప్యాట్నీ ఎక్స్‌ రోడ్డు, ప్యారడైజ్‌, మినిస్టర్‌ రోడ్‌ లేదా క్లాక్‌ టవర్‌, సంగీత్‌ ఎక్స్‌ రోడ్డు, సికింద్రాబాద్‌ స్టేషన్‌, చిలకలగూడ, ముషీరాబాద్‌ ఎక్స్‌ రోడ్డు, కవాడిగూడ, మారియట్‌ హోటల్‌ మీదుగా మళ్లిస్తారు. ప్యారడైజ్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహనాలు ఆర్‌పి రోడ్, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్ లేదా ప్యారడైజ్ మీదుగా మళ్లిస్తారు. హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్‌, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను క్లాక్‌ టవర్‌ వరకు మాత్రమే అనుమతిస్తారు. మళ్లీ ప్యాట్నీ, ఎస్‌బీఐ ఎక్స్‌ రోడ్డు మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది


Also Read: అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మంచిది - గురుపౌర్ణమి సందర్భంగా పంచాక్షరి మంత్రంలో మారుమోగుతున్న అగ్నిలింగ క్షేత్రం!