Pawan Kalyan: మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబాల మధ్య గ్యాప్‌ చాలా పెరిగిపోయిందన్న విమర్శలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అరవింద్‌కు బాగా నమ్మినబంటు బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలకు మరింత బలన్నిచ్చాయి.


పవన్ వ్యాఖ్యల కలకలం
ఆయ్‌ సినిమా ప్రమోషన్స్‌లో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చెప్పిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో పాలకొల్లు నుంచి జనసేన తరఫున బన్నీ వాసు బరిలో దిగుతారని బాగా ప్రచారం సాగింది. ఇదే విషయాన్ని మీడియా అడగ్గా తనను పవన్‌ 2019లోనే పోటీ చేయమని కోరారని చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల ముందు కూడా మరోసారి పవన్‌ను కలిసినప్పుడు పోటీ విషయం గుర్తు చేశారన్నారు. కానీ తాను అరవింద్‌గారిని అడిగా చెబుతా అన్నప్పుడు ఆయనకు అర్థమైపోయిందని ... నువ్వు నీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయి వచ్చినప్పుడు రా అని పంపించేశారని బన్నీవాసు చెప్పారు. ఈ వీడియో సోషల్‌మీడియాల విపరీతంగా షేర్‌ అవుతోంది. బన్నీవాసు చెప్పిన విషయం చూస్తే.... అరవింద్‌ పేరు చెప్పగానే పవన్‌ రియాక్షన్ మారిపోయినట్లు తెలుస్తోంది. వాళ్లు, వీళ్లను అడిగి కాదు...నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకో అన్న హింట్ ఇచ్చినట్లు తెలిస్తోంది. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు మరసారి బహిర్గతమయ్యాయి..


మెగా కాంపౌండ్‌లో కనిపించని అరవింద్‌
శ్రీకృష్ణ అర్జున్‌లా ఎప్పుడూ కలిసిమెలిసి కనిపించే చిరంజీవి, అల్లుఅరవింద్‌ ఈ మధ్యకాలంలో పెద్దగా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు చూసినా చిరంజీవి ఇంట్లోనే ఉండే అరవింద్‌ ఇప్పుడు ఆ దరిదాపుల్లోకి కూడా రావడం లేదని తెలిసింది. ఈసారి ఎన్నికల్లో జనసేన అద్భుత విజయం సాధించడమేగాక..పవన్‌కల్యాణ్ డిప్యూటీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్న చిరంజీవి కుటుంబం ఆశీర్వాదానికి వచ్చినప్పుడు కూడా అల్లు కుటుంబ సభ్యులు ఎవరూ కనీసం కనిపించలేదు. కేవలం చిరంజీవి, నాగబాబు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అటు అరవింద్‌గానీ, ఇటు అల్లు అర్జున్‌గానీ కనీసం బహిరంగంగా పవన్‌ను వి‌ష్ చేయకపోవడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఈసారి జనసేన తరఫున తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది నటులు, చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ప్రచారం చేశారు. మొత్తం ఇండస్ట్రీ పెద్దలు సైతం పవన్‌ గెలుపును కోరుకున్నారు. కానీ సొంత కుటుంబ సభ్యులైన అరవింద్ ఫ్యామిలీ మాత్రం ఎక్కడా ప్రచారం కాదుకదా..కనీసం పేపర్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.


అల్లు అర్జున్ వ్యవహార శైలే కారణం
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ వ్యవహార శైలే ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాటకు ముందు మామయ్య, మాటకు వెనక మామయ్యా అంటూ తెగ చెప్పే అర్జున్‌.. ఒకటి, రెండు బ్లాక్‌బ్లస్టర్ హిట్‌లు ఇచ్చిన తర్వాత మార్పు వచ్చింది. గతంలోనూ ఒకటి,రెండుసార్లు పవన్‌, చిరు ఫ్యాన్స్‌పై ఆయన విరుచుకుపడ్డారు. వేరేవాళ్ల ఆడియో ఫంక్షన్లకు వచ్చి గొడవ ఏంటని మండిపడ్డారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీయే కాదు...మెగా ఫ్యాన్స్ సైతం అల్లుఅర్జున్‌కు దూరమయ్యారు.


Also Read: మూడేళ్లలో సగం సినిమా థియటర్లు క్లోజ్‌- అనుకూల ప్రభుత్వాలు ఉన్నా నో యూజ్‌- నిర్మాత బన్నీ వాసు సంచలన కామెంట్స్


ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నీ తానై వ్యవహించిన అరవింద్‌, ఇప్పుడు కనీసం జనసేనకు మద్ధతుగా ఒక్కమాట కూడా ఎక్కడా చెప్పలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం కూటమికి మద్దతుగా ఉందని, ఆ హీరోల ఫ్యాన్స్ మొత్తం గంపగుత్తగా కూటమికి ఓట్లు వేస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో అనూహ్యంగా అల్లుఅర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారామచంద్రారెడ్డి తరఫున ప్రచారం చేయడం వారి రెండు కుటుంబాల మధ్య మరింత అగాధం పెంచింది. ఈ వ్యవహారంతో అటు కూటమి మిత్రుల వద్ద కూడా పవన్‌కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. ఇప్పుడు పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వేడి ఇంకా చల్లారినట్లు కనిపించడం లేదు.



అన్‌ఫాలో చేసిన సాయిధరమ్‌తేజ్‌ 
ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే అల్లుఅర్జున్‌ను సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో అయ్యారు మెగా హీరో సాయిధరమ్ తేజ్‌. ఇది కూడా తీవ్ర దుమారం రేపింది. మరోవైపు నాగబాబు కూడా అల్లుఅర్జున్‌ను టార్గెట్ చేస్తూ కొటేషన్లు షేర్ చేయడం విభేదాలపై మరింత స్పష్టత వచ్చింది. 


Also Read: అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య గొడవ - క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు, ఇవన్ని పాసింగ్‌ క్లౌడ్స్‌..


ప్రజారాజ్యం టైంలో కూడా...
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్నీ తానై అల్లు అరవింద్ నడిపించారు. అప్పట్లో ఈ విధానం పవన్ కల్యాణ్‌కు నచ్చలేదని చెప్పుకున్నారు. ఆ పార్టీ నుంచి విడిపోయినప్పుడు బయటకు వచ్చిన వారంతా అరవింద్‌వైపే వేళ్లన్నీ చూపించారు. విలీనం విషయంలో కూడా అరవింద్ ప్రధాన పాత్ర పోషించారని పవన్ వర్గం చెప్పుకునేది. అందుకే అప్పటి నుంచి అరవింద్, పవన్ మధ్య గ్యాప్ ఉండేదని అంటారు. అప్పుడప్పుడూ కలిసినా ఆ పొలిటికల్ గ్యాప్ అలానే ఉండిపోయిందని అంటారు. ఈ మధ్య నిర్మాతల మండలి పవన్ కలిసినప్పుుడు అరవింద్ కూడా వారితో ఉన్నారు. నవ్వుతూనే ఆయన్ని పలకరించారు. ఫొటోలు కూడా దిగారు. ఎప్పుడో రాజకీయంగా ఏర్పడిన గ్యాప్ ఇంకా సర్దుకోలేదని టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.