Bunny Vasu React on Clashes Between Mega and Allu Family: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు పెరిగాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రెండు కుటుంబాల తీరు చూస్తుంటే అవుననే సమాధానాలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని నిర్మాత బన్నీవాసు తాజాగా స్పష్టం చేశారు. ఇదంతా తొలగడానికి ఒక సందర్భంగా వస్తుందని, అది వచ్చిన రోజు ఈ మనస్పర్థలన్ని తొలిగిపోవాలని, ఆ సమయం కోసం తాను ఎదురచూస్తున్నానంటూ కామెంట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అయ్యింది.
కాగా నిర్మాత బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు ఫ్యామిలీకి ఆయన చాలా దగ్గర. GA2 పిక్చర్స్ నిర్మాతల్లో ఆయన ఒకరు. తాజాగా ఆయన నిర్మాణంలో వస్తున్న ఆయ్ మూవీ రిలీజ్ సందర్భంగా బన్నీ వాసు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అల్లు-మెగా ఫ్యామిలీ గొడవలపై ఓ విలేఖరి ప్రశ్నించారు. నంద్యాల వెళ్లినప్పుటి నుంచి అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు వచ్చాయని అంటున్నారు.. దీనిపై మీరు ఏం చెబుతారని ప్రశ్నించారు. దీనిపై మొదట ఏం మాట్లాడలేకపోయి చిరునవ్వు చిందించారు బన్నీవాసు.
ఆ తర్వాత చెప్పాలంటూ రిపోర్టర్ అడగడంతో ఆయన ఊహించని కామెంట్స్ చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. "ఒక కుటుంబం అన్నాక కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్థలు రావడం సాధారణం. అవన్ని పక్కన పెడితే అల్లు-మెగా ఫ్యామిలీని నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. వారి కుటుంబాల్లో ఏం జరుగుతుంది, వారి ఫ్యామిలీ జరిగే సిట్యూవేషన్స్ చూస్తున్నా. చిరంజీవి ఎప్పుడు కూడా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి. అందుకే ఆయన ప్రతి ఏడాది సంక్రాంతికి ఫ్యామిలీ మొత్తాన్ని బెంగళూరు తీసుకువెళ్తారు. అందరిని తీసుకువెళ్లి ఓ సెలబ్రేషన్స్‌లా చేస్తారు ఆయన. అప్పుడు చాలా ఖర్చు అవుతుంది.
ఇవన్ని జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే..
అందరు స్టార్స్ అంతా ఒక్కచోట వెళ్లడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా ఖర్చు అవుతుంది.కానీ అవన్ని కాదు.. దాని వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే మీమంతా ఒకటని చూపించడమే. ఇప్పుడు పిల్లలు అంతా పెద్దగా ఆయ్యారు. ఎవరికి వారికి స్వంత్య్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ ఉంది. కానీ చిరంజీవి మేమంతా ఒకటి, మాది ఒకే ఫ్యామిలీ అనే ఒక మెసేజ్ ఇవ్వడమే. అయితే కొన్ని సందర్భాల్లో ఒకరు తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని కొన్ని మనస్పర్థాలు వస్తాయి.
ఈ తాత్కలికమైన ఇష్యూష్‌ని తీసుకుని వారి కుటుంబాల ఎమోషన్స్ నిర్ణయించడం తెలివైన నిర్ణయం కాదని నిర్ణయం అనుకొను. వారి మధ్య అనుబంధాలు ఏంటీ, ఒక సమస్య వస్తే ఒకరి కోసం ఒకరు ఎలా నిలబడతారో నాకు తెలుసు. ఇదంత తీసేయడానికి వారికి ఒకే ఒక్క సిట్చ్యూవేషన్ చాలు. ఆ సమయం కోసమే మేమంతా ఎదురుచూస్తున్నాం. ఇండస్ట్రీ అంతా కూడా ఆ కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం. వారు బాగుంటారు కూడా. ఇవన్ని జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు.