Bunny Vasu: ప్రేక్షకులు థియేటర్లకు (Theatre) వచ్చి సినిమా చూసినంతకాలమే సినీ ఇండస్ట్రీ మనుగడ సాగుతుందని... అలా కాకుండా కొత్తకొత్త పద్ధతులు అనుసరిస్తే కొంతకాలానికి కనుమరుగు అవ్వడం ఖాయమని ప్రముఖ నిర్మాత బన్నీవాసు(Bunny Vasu) ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ జీవితం ఇచ్చింది థియేటర్లేనని....ఇప్పుడు ఆ థియేటర్లే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా  ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాలని హితవు పలికారు.


50శాతం చిన్న ధియేటర్లు మూత..!
ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తూ వేసే విజిల్స్‌...అభిమాన నటుడు తెరపై కనిపించగానే గాల్లోకి కాగితాలు ఎగురవేస్తుంటే వచ్చే ఆనందం ఎన్ని కోట్లు సంపాధించినా రాదని నిర్మాత బన్నీవాసు అన్నారు. ప్రేక్షకుడు థియేటర్‌కు రావడం వల్ల కేవలం ఒక్క నిర్మాతే లాభపడిపోడని...దాన్ని నమ్ముకుని ఉన్న ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అలాగే సినిమా కూడా థియేటర్లలో చూస్తే వచ్చే కిక్‌ ఇంట్లో ఓటీటీ(OTT)లో చూస్తే రాదన్నారు..ఆ స్థాయిలో గ్రాండ్‌లుక్‌, సౌండ్‌సిస్టం ఇష్టం కష్టమన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ తప్పకుండా ధియేటర్‌కు వెళ్లే సినిమా(Cinema) చూడాలని ఆయన కోరారు.


దురదృష్టవశాత్తు కరోనా తర్వాత జనం థియేటర్లకు రావడం మానేశారని...ఓటీటీల దెబ్బకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలావరకు సింగిల్‌ స్క్రిన్‌ థియేటర్లు మూసివేసి కల్యాణమండపాలుగా మార్చేసుకున్నారన్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు మేల్కొకుంటే మరో మూడేళ్లలో ఇప్పుడు ఉన్న సింగిల్‌స్కీన్‌ థియేటర్లలో 50శాతం కనుమరుగు కావడం ఖాయమన్నారు.



ఓటీటీల దెబ్బతీశాయి
ఓటీటీల రాక ఒకరకంగా సినిమా ఇండస్ట్రీకి వరమని చెప్పుకోవాలి..మరోరకంగా దెబ్బని చెప్పుకోవాలని బన్నీవాసు అన్నారు. కరోనా సమయంలో ఇండస్ట్రీని బతికించింది కచ్చితంగా  ఓటీటీ(OTT)లే అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఓటీటీల దెబ్బకు చిన్న సినిమాలు విలవిలలాడిపోతున్నాయన్నారు. తమను తాము సిల్వర్‌స్క్రిన్‌పై  చూసుకోవాలని ఎన్నో ఏళ్లు కలలుకని ఇండస్ట్రీకి వస్తున్నారని, ఏళ్లతరబడి తిరిగి అవకాశం సంపాదించుకుని నటించినా...ఆ సినిమా థియేటర్‌ వరకు వస్తుందన్న నమ్మకాలు లేకుండా పోయాయన్నారు. చిన్న సినిమానే కదా ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని జనం థియేటర్లకు రావడం మానేస్తున్నారన్నారు. ఫలితంగా నిర్మాతలు అసలు థియేటర్లలో రిలీజు చేయకుండానే  ఓటీటీలకు అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: నాగ చైతన్య 'తండేల్'‌ వాయిదా పడనుందా? - కారణమేంటంటే!


ఇది చిన్న సినిమాలకే వర్తించడం లేదని..పెద్దపెద్ద సినిమాలు సైతం థియేటర్లలో రిలీజు అయిన నెలరోజులకే  ఓటీటీల్లో ప్రత్యక్షమవుతుండటంతో జనం థియేటర్లకు రావడం మానేస్తున్నారన్నారు. ఇది ఇప్పటికి బాగానే ఉన్నా...మున్ముందు మాత్రం ఇండస్ట్రీకి ఎంతో నష్టం చేకూరుస్తుందన్నారు. పెద్ద పెద్ద హీరోలకు సైతం 30 శాతం వరకు థియేటర్‌ రెవెన్యూ పడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో బాలీవుడు, మళయాళ ఇండస్ట్రీ ఎంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నాయని బన్నీవాసు(Bunny Vasu) తెలిపారు. అక్కడ థియేటర్‌ రిలీజుకు, ఓటీటీ రిలీజుకు 8వారాల సమయం పాటిస్తున్నారని..తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇదే విధానం పాటించాలని అనుకున్నా ఎవరూ దీనిపై నిలబడటం లేదని తెలిపారు. అలాగే పెద్దపెద్ద సినిమాల నిర్మాణం ఏడాది, రెండేళ్లు పడుతుండటంతో అప్పటి వరకు చిన్న థియేటర్లను నడిపించడం యాజమాన్యాలకు కష్టంగా మారింది. హౌస్‌ఫుల్‌లు లేక, థియేటర్లకు కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


Also Read: రాజ్ తరుణ్‌కు మరో షాకింగ్ న్యూస్- 'తిరగబడరసామీ' జంట అడ్డంగా బుక్కైనట్టేనా?


అనుకూల ప్రభుత్వాలు ఉన్నా....
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు  ఇండస్త్రీకి అనుకూల ప్రబుత్వాలే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. అటు ఏకంగా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మీరందరు కలిసి మాట్లాడుకుని ఇండస్ట్రీకి, ప్రజలకు ఉపయోగమైన ప్రపోజల్స్‌ తీసుకొస్తే సీఎం చంద్రబాబుగారు కచ్చితంగా  పని చేసిపెడతారని పవన్‌ హామీ ఇచ్చారని బన్నివాసు గుర్తుచేశారు. కానీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదని....పెద్ద నిర్మాతలైన సురేశ్‌బాబు(Suresh Babu), అల్లుఅరవింద్‌(Allu Aravind), దిల్‌రాజు వంటివారే ముందుకు రావాలని బన్నీవాసు సూచించారు. అనుకూల ప్రభుత్వాలు ఉన్నా పనిచేయించుకోలేని దురదృష్టకరపరిస్థితుల్లో ఉన్నామన్నారు.