Naga Chaitanya Thandel movie Postponed? యంగ్ హీరో నాగ చైతన్య లేటెస్ట్ మూవీ తండేల్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాకుళం చెందిన జాలర్లు వేటకు వెళ్లి పాకిస్తాన్‌లో అధికారులకు పట్టుబడతారు. అయితే వారు ఇండియాకు ఎలా తిరిగి వచ్చారు? అక్కడ ఆ మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో నాగ చైతన్య సరసన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రమిది. వరుస ప్లాప్స్ చూస్తున్న చై తండేల్‌తో ఓ భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఆ లోపు మూవీని పూర్తి చేసి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు చందు మొండేటి. అయితే ఇప్పుడు తండేల్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. దీనికి కారణం డిసెంబర్ భారీ చిత్రాలు విడుదల కానున్నాయి.
అవే అల్లు అర్జున్ 'పుష్ప 2', రాంచరణ్ 'గేమ్ ఛేంజర్', మంచు విష్ణు 'కన్నప్ప' వంటి పాన్ ఇండియా సినిమాలు డిసెంబర్‌లో విడుదల కాబోతున్నాయి. అలాగే నితిన్-శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ కూడా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇలా భారీ సినిమాలు క్యూ లైన్లో ఉండటంతో నాగ్ చైతన్య తండేల్ మూవీని వాయిదా వేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్టు తెలుస్తోంది. తండేల్‌ను 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం 'తండేల్' కొత్త రిలీజ్ డేట్ అన్వేషణలో ఉన్నారట మేకర్స్. అది ఫిక్స్ కాగానే మూవీ వాయిదా వేసి కొత్త రిలీజ్ ప్రకటించే అవకాశం ఉందని ఫిలిం దూనియాలో టాక్. మరి దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.నిజానికి ప్రస్తుతం నాగ్ చైతన్య తండేల్ సక్సెస్ చాలా ముఖ్యం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌స్టోరీ మూవీ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చై ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. బంగర్రాజు బాగానే నడిచిన ఆ క్రెడిట్ నాగార్జునకే ఎక్కువ వెళ్లిందంటున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన థ్యాంక్యూ, కస్టడీ చిత్రాలు.. అతడి బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'లు బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. దీంతో వరుస ప్లాప్స్ చూసిన నాగ చైతన్య తండేల్‌తో భారీ హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. అలాగే అక్కినేని ఫ్యాన్స్ కూడా చై నుంచి ఓ సాలీడ్ హిట్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'తండేల్'ను ఈ పాన్ ఇండియా చిత్రాలతో కలిసి రిలీజ్ చేయడమంటే రిస్క్ అనే చెప్పాలి. అందుకే తండేల్‌ను వాయిదా వేయక తప్పదనే అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి మూవీ టీం కూడా ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది. మరి ఈ రూమర్‌నే తండేల్ టీం నిజం చేస్తుందా? ముందుగా చెప్పిన తేదీగా రిలీజ్ చేస్తారా అనేది తెలియాలటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Also Read: అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య గొడవ - క్లారిటీ ఇచ్చిన బన్నీ వాసు, ఇవన్ని పాసింగ్ క్లౌడ్స్..