Raj Tarun Case Update: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తనని మోసం చేసి, హీరోయిన్ మాల్వీ మల్హో‌త్రాతో ప్రేమాయణం సాగిస్తున్నారని లావణ్య ఆరోపిస్తున్న తరుణంలో.. ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ - మాల్వీల పేరుతో వాట్సాప్ చాట్ లీక్ అయ్యింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


లవ్‌ ప్రపోజల్


వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ ప్రకారం, 2023లో మాల్వీ మల్హో‌త్రాకి రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. దీనికి మాల్వీ వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అలానే వీరిద్దరూ కోయంబత్తూర్ లోని మాధవ హోటల్‌ లో కలుసుకునేవారనే సమాచారం మెసేజెస్ లో ఉంది. మాల్వి చాలాసార్లు రాజ్ తరుణ్‌ కోసం హోటల్స్ బుక్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఇద్దరూ తరచుగా వీడియో కాల్స్ చేసుకోవవడం, ప్రతీది షేర్ చేసుకోవడం ఈ చాట్స్ లో కనిపిస్తోంది. 


లావణ్య ఫిర్యాదుతో వెలుగులోకి 


రాజ్‌ తరుణ్ తనతో సహజీవనం చేసి, ఇప్పుడు వదిలించుకోవాలని చేస్తున్నాడంటూ లావణ్య అనే యువతి కొన్ని రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 'తిరగబడరసామీ' హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తమ లైఫ్ లోకి వచ్చిన తర్వాతే రాజ్‌ తనను దూరం పెట్టాడని లావణ్య తెలిపింది. ఈ విషయం అడిగితే మాల్వీతో పాటుగా ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రా తనను బెదిరించారని కంప్లెయింట్ లో పేర్కొంది. అంతేకాదు తనకు ఓసారి గర్భం వస్తే అబార్షన్ చేయించుకునేలా రాజ్ తరుణ్ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. దీనికి సంబంధించి తన దగ్గరున్న ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారాలుగా సమర్పించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసారు. 



సోషల్ మీడియాలో వైరల్


లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ ఇప్పటికే స్పందించారు. సినిమాలో కలిసి నటించామే తప్ప, మాల్వీ మాల్హోత్రాతో తనకు ఏ సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రాజ్ తరుణ్, మాల్వీల వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ స్క్రీన్ షాట్స్‌‌ను కూడా లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో జత చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 


Also Read: నాగ చైతన్య 'తండేల్'‌ వాయిదా పడనుందా? - కారణమేంటంటే!


గడువు కోరిన రాజ్‌తరుణ్


ఇదిలా ఉంటే లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు..  ఏ-1 గా రాజ్‌ తరుణ్‌, ఏ-2గా మాల్వీ మల్హోత్రా, ఏ-3గా మయాంక్‌ మల్హోత్రాలను చేర్చారు. మరోవైపు లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. ఈ వివాదాన్ని చట్టపరంగానే పరిష్కరించుకుంటామని అన్నారు. ఈ క్రమంలోనే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తోందంటూ మాల్వీ కూడా లావణ్యపై కేసు పెట్టింది. ఇలా ముగ్గురిపైనా కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలని రాజ్ తరుణ్ కు పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని రాజ్ తరుణ్ పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.


Also Read: ఎన్టీఆర్ కి ఫోన్ చేస్తే 'ఎవరి కష్టం వారిదే' అన్నాడు - 'ఆయ్' ఈవెంట్ లో అల్లు అరవింద్