Guppedanta Manasu Serial Today Episode: బయట వెయిట్ చేస్తున్న వసుధార లోపల మాట్లాడుతున్న దేవయాని గొంతు విని ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది అనుకుని లోపలికి వెళ్తుంది. లోపలి నుంచి వసుధార రావడం గమనించిన సరోజ అమ్మో ఇది లోపలికి వస్తుంది. ఇది వస్తే ఇంకేం అనుకుంటూ బయటకు వెళ్లి వసుధారను పక్కకు లాక్కెళుతుంది. నువ్వు లోపలికి రావొద్దని వస్తే నా పెళ్లి సెట్ చేస్తావని సరోజ అనగానే నాకు లోపల ఎవరో తెలిసినట్లు అనిపిస్తే వస్తున్నానని చెప్తుంది. మరోవైపు ధన్‌రాజ్ రంగాను సరోజ ఎప్పటి నుంచి తెలుసని అడుగుతాడు.
రంగ: చిన్నప్పటి నుంచి తెలుసు.
ధనరాజ్: అంటే చిన్నప్పటి నుంచి తెలిస్తే మీరే సరోజను పెళ్లి చేసుకోవచ్చు కదా? మీ ఈడు జోడు కూడా బాగుంటుంది. ఏమంటావు అమ్మా
రంగ: చిన్నప్పటి నుంచి తెలుసు కానీ నాకెప్పుడు తన మీద ప్రేమ పెళ్లి అనే ఆలోచన రాలేదు. మా ఇద్దరి మధ్య ఉంది కేవలం బావ మరదళ్ల సంబంధమే
ధనరాజ్: మరి మీకు తన మీద ప్రేమ లేకపోతే తనకు మీ మీద ప్రేమ ఉండొచ్చు కదా
రంగ: అలాంటిదేం లేదండి.
ధనరాజ్: ఏమో తనని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది.
సంజీవ: తను మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలా ప్రవర్తించింది అంతే
ధనరాజ్: అవునా నిజమా?
రంగ: కావాలంటే ఇప్పుడే మీరే చూడండి. తనొచ్చి ఏం చెప్తుందో తెలుసా? మా బావంటే నాకిష్టం. బావ లేకుండా నేనుండలేను. అని ఏవేవో సినిమా డైలాగులు చెప్తుంది.
ధనరాజ్: ఎందుకు?
సంజీవ: మిమ్మల్ని టెస్ట్ చేయడానికి
సరోజ: నువ్వు కానీ ఇప్పుడు లోపలికి వచ్చావంటే నేను ఎంతకైనా తెగిస్తాను. ప్రాణాలు తీయడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా
వసుధార: అంత అవసరం లేదులే కానీ వెళ్లు వెళ్లి రిషి సర్ ను త్వరగా రమ్మను.
అనగానే సరోజ లోపలికి వెళ్తుంది. వెంటనే స్ట్రెయిట్‌గా చెప్తున్నాను. అంటూ రంగ ఇష్టమని రంగ లేకపోతే బతకలేనని అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానంటే మీ ఇష్టం అని సరోజ చెప్పగానే ధనరాజ్ అయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అంటాడు. దీంతో రంగ తాను వెళ్తానని చెప్పి వెళ్లిపోతుంటే శైలేంద్ర, దేవయాని భయంగా లేచి నిలబడతారు. సరోజ పెళ్లి ఇష్టం లేదని తెగేసి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఎంజేల్, మనును కాలేజీ వదిలేయడం ఏంటని అడుగుతుంది.
మను: నాకు వదిలేయడం ఇష్టం లేదు. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకని నేను అయిష్టంగానే కాలేజీ నుంచి దూరం కావాల్సి వచ్చింది.
ఎంజేల్: ఏంటి బావా ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు వదిలేశావు. మొన్న దేవయాని మాటలకు ఈ నిర్ణయం తీసుకున్నావా?
మను: అదేం లేదు. ఒకరికి భయపడో ఒకరు బ్లాక్ మెయిల్ చేశారనో నా నిర్ణయాలు మార్చుకోను
ఎంజేల్: ఏంటి అత్తయ్యా నువ్వైనా చెప్పొచ్చు కదా?
అనుపమ: తనని కాలేజీ నుంచి దూరం అవ్వమని చెప్పిందే నేను.
అని అనుపమ చెప్పగానే ఎంజేల్ షాక్ అవుతుంది. ఎందుకు వదిలేయమన్నావని అడుగుతుంది. అనుపమ పలకదు. నువ్వు చెప్పకపోతే బావ ఇదివరకు ఎండీ అయ్యేవాడు. పాపం నీవల్లే తను అన్ని వదులుకుంటున్నాడు. అనగానే నువ్వు నా మీద జాలి చూపించొద్దు నేను మా అమ్మ కోసం ఏమైనా చేస్తానని మను అంటాడు. మరోవైపు మహేంద్ర, వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ధరణి వచ్చి బాధపడొద్దని మీకు మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్తుంది. మరోవైపు ఆటోలో వెళ్తున్న వసుధార, రంగను పెళ్లికొడుకు ఎలా ఉన్నాడని అడుగుతుంది. అదంతా నాకెలా తెలుస్తుందని నేను వాళ్లకు ఒక క్లారిటీ ఇవ్వడానికి అక్కడికి వెళ్లానని చెప్తాడు రంగ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.