Parama Ekadashi 2023: సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఏడాదికి 24 ఏకాదశులు వచ్చినా, అధిక‌ మాసాల్లో ఏడాదికి 26 ఏకాదశి వ్రతాలు వస్తాయి. ఏకాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం అయితే, మరోవైపు అధిక మాసం కూడా విష్ణువుకు ఇష్టమైన నెల‌. అందువల్ల ఈ ఏకాదశి ప్రాముఖ్యత హిందూ ధ‌ర్మ‌ కోణం నుంచి మరింత పెరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణ పక్ష ఏకాదశిని పరమ ఏకాదశి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును భ‌క్తిప్ర‌ప‌త్తుల‌తో పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. పరమ ఏకాదశి 2023 శుభ ముహూర్తం, పూజా ఆచారాలు - విధానం, ప్రాముఖ్యత, మంత్రాల గురించి తెలుసుకుందాం.


పరమ ఏకాదశి ప్రాముఖ్యత
మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక‌మాసంలో మాత్ర‌మే వచ్చే పరమ ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల సుఖసంతోషాలు, సంపదలు చేకూరుతాయి. అందువ‌ల్ల జీవితంలో నెల‌కొన్న దుఃఖం, పేదరికం తొలగిపోతాయని నమ్ముతారు. అదే సమయంలో సమస్త పాపాలు నశించి స్వర్గవాసం లభిస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. ఈ ఏకాదశిని అరుదైన విజయాల ఏకాదశిగా అభివర్ణిస్తారు. అందుకే దీనిని పరమ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి, వ్రత కథను వినడం వల్ల 100 యాగాల పుణ్యం లభిస్తుందని, శంఖం, చక్రం, గదలతో విష్ణువును పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని గ్రంధాలలో చెప్పారు.


Also Read : స్త్రీలు విష్ణు సహస్రనామం జపించకూడదా - ఎందుకు!


పరమ ఏకాదశి శుభదినం: 12 ఆగస్టు 2023, శనివారం
ఏకాదశి తిథి ప్రారంభం - 2023 ఆగస్టు 11, ఉద‌యం 7:36 నుంచి
ఏకాదశి తిథి గడువు - 2023 ఆగస్టు 12 ఉదయం 8.30 వరకు
పరమ ఏకాదశి పూజ ముహూర్తం - 12 ఆగస్టు 2023 ఉదయం 7.28 నుంచి 10.50 వరకు
పరణ సమయం - 12 ఆగస్టు 2023న ఉదయం 8.50 గంటల ముందు, ఉదయ తిథిని జరుపుకొంటారు, పరమ ఏకాదశి వ్రతాన్ని ఆగస్టు 12వ తేదీ శనివారం జరుపుకొంటారు. ద్వాదశి తిథి ఆగస్టు 12వ తేదీ ఉదయం 8:30 నుంచి ఆగస్టు 13న ఉదయం 8:50 వరకు అంటే ఆగస్టు 13న ద్వాదశి తిథిగా జరుపుకొంటారు.


పరమ ఏకాదశి పూజ విధానం
పరమ ఏకాదశి వ్రతం రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, చేతిలో అక్షత, పుష్పాలతో విష్ణుమూర్తి ముందు ధ్యానం చేసి ఉపవాస వ్రతం చేయాలి.
దీని తరువాత, పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి విష్ణువు విగ్రహం లేదా ఫొటో ఉంచి, పూజా సామగ్రిని పీఠం క్రింద ఉంచండి.
దీని తరువాత పంచోపచార పద్ధతితో పూజ చేయండి.
పూజ అనంతరం నైవేద్యాన్ని సమర్పించండి.


Also Read : శ్రీ‌మ‌హా విష్ణువు వివిధ నామాలు, వాటి అర్థం, ప్రాముఖ్యత మీకు తెలుసా?


దీని తరువాత విష్ణువుకు హార‌తి ఇచ్చి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి.
అప్పుడు మీరు దానం చేసి పండు తినవచ్చు.
సాయంత్రం పూట కూడా పూజ చేసి ద్వాదశి తిథి నాడు కూడా విష్ణుస‌హ‌స్ర నామ పారాయ‌ణ చేయాలి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.