Horoscope Today 2023 August 11th


మేష రాశి


ఈ రాశి ఉద్యోగులు పనితీరు మార్చుకునే ప్లాన్ లో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తి వివాదాలు సమసిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేయగలుగుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి


వృషభ రాశి


ఈ రాశివారు ఈరోజు స్నేహితులను కలుస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వైవాహికి జీవితం బావుంటుంది. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వకండి


మిథున రాశి 


ఈరోజు దగ్గరి బంధువుతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తూలొద్దు. ఆసక్తికరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఈరోజు ఓ శుభవార్త వింటారు


కర్కాటక రాశి 


ఈ రాశివారు దురాశను తగ్గించుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. ఈరోజు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. అవివాహితుల వివాహం స్థిరపడుతుంది. అనుకోని ప్రయాణం  చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.


సింహ రాశి


ఈ రాశివారు ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. అనవసర మాటలు నియంత్రించుకోవాలి.  ధనలాభం ఉంటుంది. నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. వాహానాన్ని జాగ్రత్తగా నడపండి ప్రమాద సూచనలున్నాయి. 


కన్యా రాశి 


ఎవరి స్వేచ్చకు ఆటంకం కావొద్దు. వృత్తికి సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఎవరికీ తప్పుడు సలహాలు ఇవ్వొద్దు. డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.


తులా రాశి 


ఈ రాశివారికి కొన్నాళ్లుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.  పిల్లల విజయాలపై ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 


వృశ్చిక రాశి 


ఈ రాశివారి ప్రవర్తనలో కొన్ని మార్పులొస్తాయి..అవి మంచా చెడా ..ఎటువైపు వెళ్లాలి అనేది పూర్తిగా మీరు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని పనులపై బయటకు వెళ్లే అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా అనుకున్నవి అనుకున్నట్టు ఈ రోజు పూర్తవుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. 


Also Read: వాయు, అగ్ని, నీరు, భూమి - మీ రాశి దేనికి సంకేతం!


ధనుస్సు రాశి


ఈ రాశివారికి పూర్వీకుల నుంచి ఆస్తి కలిసొస్తుంది. వ్యాపార పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ సంబంధిత పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కార్యదక్షత పెరుగుతుంది.


మకర రాశి 


ఈ రాశివారు స్నేహితులతో కలసి భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించేందుకు మంచి సమయం. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఏ పనిలోనూ తొందరపడకండి. ప్రభుత్వానికి సంబంధించి సాగుతున్న వ్యవహారాలు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. రహస్య విషయాలు ఎవరికీ చెప్పకండి.


Also Read: శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం ఎందుకు ప్రత్యేకం!


కుంభ రాశి


ఈ రాశులవారు కొంత స్ట్రాంగ్ గా ఉండాలి. మిమ్మల్ని వినియోగించుకుని వేరేవారు లాభపడే సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు పనితీరులో మార్పు తీసుకొస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 


మీన రాశి 


ఈ రాశివారు ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన రాజకీయనాయకులు జాగ్రత్తగా ఉండాలి. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఆ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి.