Astrology: భూమి, అగ్ని, వాయువు ,నీరు..ప్రతి రాశికి ఒక మూలకం ఉంటుంది. మూడు రాశిచక్రాలు ఓ మూలకాన్ని పంచుకుంటాయి. ఆ మూలకం ప్రభావం మీపై ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి ఈ రాశి ప్రకారం మీ మూలకం ఏంటి.. మీ రాశి దేనికి సంకేతమో ఇక్కడ తెలుసుకోండి. 


నీటి సంకేతం (Water Signs)


నీటి సంకేతం ఉన్న రాశులవారు చాలా ఎమోషనల్ గా ఉంటారు అల్ట్రా సెన్సిటివ్. వీళ్లు సముద్రం లాంటివారు. సముద్రంలా వీరిలో చాలా రహస్యాలుంటాయి కానీ ఏదీ అంత త్వరగా బయటపడరు. ముఖ్యంగా నీటి సంకేతం ఉన్న రాశులవారు లోతైన సంభాషణను, సాన్నిహిత్యాన్ని ఇష్టపడతారు. అందరిలోనూ కలిసినట్టే ఉంటారు కానీ వీరి మనసులోంచి ఏ మాటా అంత తేలిగ్గా బయటపడదు. ప్రియమైన వారికి ఎప్పుడూ మద్దతుగా ఉంటారు.  కొన్నిసార్లు మూడీగా, అనుమానాస్పదంగా కూడా ఉంటారు..
నీటి సంకేతానికి చెందిన రాశులు:  1. కర్కాటకం, 2.వృశ్చికం, 3. మీనం


Also Read: స్త్రీలు మంగళసూత్రం విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు ఇవే!


అగ్ని సంకేతం (Fire Signs)


అగ్ని సంకేతం ఉన్న రాశులవారు డైనమిక్ గా ఉంటారు. వీరికి త్వరగా కోపం వచ్చేస్తుంది అంతే త్వరగా క్షమించేస్తారు. అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగినవారు, చాలా తెలివైనవారు అవుతారు. స్వీయ-అవగాహన, సృజనాత్మక, ఆదర్శవాద వ్యక్తులు, మాటల కన్నా చర్యలకు సిద్ధంగా ఉంటారు.
అగ్ని సంకేతానికి చెందిన రాశులు: 1.మేషం, 2.సింహం, 3. ధనుస్సు


భూమి సంకేతం (Earth Signs)


భూమి సంకేతానికి చెందిన రాశులవారిలో ఎక్కువ మంది సంప్రదాయవాదులు, వాస్తవికంగా ఉంటారు. వీరిలో భావోద్వేగాలు చాలా ఉంటాయి.  భౌతిక వస్తువులకు తొందరగా ఆకర్షితులవుతారు. ఏ విషయంలో అయినా ఆచరణాత్మకంగా, విశ్వసనీయంగా, స్థిరంగా ఉంటారు. ఎదుటివారికి కష్ట సమయం వచ్చినప్పుడు అండగా నిలవడంలో ముందుంటారు.  కష్టమైన పరిస్థితుల్లో కూడా చెదిరిపోకుండా నిశ్చలంగా ఉంటారు
భూమి సంకేతానికి చెందిన రాశులు:  1.వృషభం, 2.కన్య, 3.మకరం


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


వాయు సంకేతం (Air Signs)


వాయు సంకేతానికి చెందిన రాశులవారు హేతుబద్ధంగా ఉంటారు. ప్రేమ కమ్యూనికేషన్ విషయంలో వీరిని మించినవారే ఉండరు. ఈ సంకేతానికి చెందిన రాశులవారు ఆలోచనాపరులు, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. సంభాషణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. వారు తాత్విక చర్చలు, సామాజిక సమావేశాలను, మంచి పుస్తకాలను ఇష్టపడతారు.  సలహాలు ఇవ్వడంలో వీరి ఆనందమే వేరు. వాయువు అంటే గాలి కదా.. అందుకు నిదర్శనంగా వీరు మనసులో ఏదీ దాచుకోలేరు. చల్లటి గాలి ప్రసరించినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తారో, సుడిగాలిలా మారితే మాత్రం ఎదుర్కోవడం కష్టమే.  
గాలి సంకేతానికి చెందిన రాశులు: 1.మిథునం, 2.తులా, 3.కుంభం


Also Read:  ఆగష్టు 10 రాశిఫలాలు, ఈ రాశులవారు కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి!


గమనిక: ఆయా రాశిలో విషయాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.