Horoscope Today 2023 August 10th


మేష రాశి 
ఈ రాశివారు ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం అనుకోకుండా అందుకుంటారు. సెంటిమెంట్స్ కి పెద్దగా ఛాన్స్ ఇవ్వరు తెలివిగా ఆలోచించి పనిచేస్తారు. దూకుడు వల్ల కొన్ని బంధాల్లో చీలీకి రావొచ్చు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బంధువులతో మంచి సంబంధాలుంటాయి. 


వృషభ రాశి
ఈ రాశివారి పనితీరు మెరుగుపడుతుంది. తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రియమైనవారిని, పెద్దలను గౌరవించండి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. బయటి వ్యక్తులతో వివాదాలు మీ కుటుంబ జీవితంపై ప్రభావం చూపిస్తారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారం అవుతాయి. 


మిథున రాశి
ఈ రాశివారు కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలి. నూతన  ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు ఈ రోజు అంత మంచిది కాదు. సీనియర్ల నిర్లక్ష్యం కారణంగా మీరు బాధపడతారు. మీ గౌరవం తగ్గవచ్చు. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు.


Also Read: రోడ్డుపై వీటిని తొక్కేస్తున్నారా - ఏం జరుగుతుందో తెలుసా!


కర్కాటక రాశి  
ఈ రాశి వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులు పెద్ద రాజకీయ పదవులు పొందగలరు. ఈరోజు పిల్లలతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామి గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 


సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో సెటిలవుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. 


కన్యా రాశి 
ఈ రాశి ఉద్యోగులు స్వతంత్రతతో పని చేయాలనుకుంటున్నారు. మీ ఆలోచనలు అమలు చేయండి మంచి ఫలితాలు సాధిస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు శ్రద్ధ చూపిస్తారు.


Also Read: శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం ఎందుకు ప్రత్యేకం!


తులా రాశి 
ఈ రాశివారి జీవితంలో కష్టాలు పెరుగుతాయి. వ్యాపారులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రతి పనిలోనూ తొందరపాటు పనికిరాదు. పని విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. 


వృశ్చిక రాశి 
ఈ రాశివారు సేవా కార్యక్రమాలు చేసేందుకు ఖర్చు చేస్తారు.  వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెడతారు. చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీరు సహోద్యోగులతో కలిసి సౌకర్యవంతంగా పని చేస్తారు. (కుటుంబ జీవితంలో విభేదాలు తొలగిపోతాయి 


ధనుస్సు రాశి
ఈ రాశివారు పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. తండ్రి మార్గదర్శకత్వంలో వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు.  ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. పెద్ద ఫంక్షన్‌కు హాజరవుతారు


మకర రాశి 
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు యజమాని నుంచి అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంట్లో కొంత కలవరం ఉంటుంది. విద్యార్ధులకు చదువు విషయంలో కొంత ఆందోళన ఉంటుంది. ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంది.


కుంభ రాశి
ఈ రోజు మీరు పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శ్వాసకోశ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారంలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మాటలు వద్దు. పొట్టకు సంబంధించిన సమస్య ఎదుర్కొంటారు


మీన రాశి
ఈ రాశివారు తలపెట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. కెరీర్‌కి సంబంధించి కొత్త ప్లాన్‌ వేసుకుంటారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి. అధికారుల దృష్టిలో మీ ఇమేజ్ బలంగా ఉంటుంది.


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.