ASRB Jobs: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 368 సైంటిస్ట్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Continues below advertisement

ASRB Recruitment: దేశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని పరిశోధన సంస్థలు/ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డాక్టోరల్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 8లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Continues below advertisement

వివరాలు..

మొత్తం పోస్టుల సంఖ్య: 368

➥ ప్రిన్సిపల్ సైంటిస్ట్: 80 పోస్టులు

➥ సీనియర్ సైంటిస్ట్: 288 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు 52 సంవత్సరాలు; సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు 47 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పే స్కేల్: నెలకు ప్రిన్సిపల్ సైంటిస్ట్‌ పోస్టులకు రూ.1,44,200 - రూ.2,18,200. సీనియర్ సైంటిస్ట్ పోస్టులకు రూ.1,31,400 - రూ.2,17,100.

ముఖ్యమైన తేదీలు:

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 18.08.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2023.

➥ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08.09.2023.

Notification

Website

ALSO READ:

1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్  జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement