Dinosaur Fossil: డైనోసార్లు అనగానే అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. ఈ దేశాల్లోనే ఎక్కువగా డైనోసార్ల ఆనవాళ్లను ఇప్పటి వరకు గుర్తించారు శాస్త్రవేత్తలు. చాలా ప్రాంతాల్లో వివిధ జాతుల డైనోసార్ల అవశేషాలు కనుగొన్నారు. కానీ ఇప్పటి వరకు డైనోసార్లు భారత దేశ భూభాగంపై తిరిగినట్లు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. దీంతో డైనోసార్లు భారత్ లో లేవని అనుకున్నారు ఇన్ని రోజులు. అయితే తాజాగా లభించిన ఆనవాళ్లతో.. డైనోసార్లు భారత్ లోనూ సంచరించాయని శాస్త్రవేత్తలు తేల్చారు. తాజాగా రాజస్థాన్ లో పురాతత్వ శాస్త్రవేత్తలు డైనోసార్ల ఆనవాళ్లు గుర్తించారు. అలాగే ఈ డైనోసార్లు మొక్కలను ఆహారంగా తీసుకునే పొడవైన మెడ కలిగిన డైనోసార్లుగా తేల్చారు. జురాసిక్ పార్కు సినిమాల్లో కనిపించిన పొడవాటి శాఖాహార డైనోసార్ల వంటివే ఇవి కూడా అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని థార్ ఎడారిలో ఈ అవశేషాలు గుర్తించారు. 


17.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి శిలాజం


తాజాగా గుర్తించిన డైనోసార్లకు రాజస్థాన్ లోని థార్ ఎడారి గుర్తుగా థారోసారస్ ఇండికస్ అనే పేరు పెట్టారు. ఐఐటీ రూర్కెలా పరిశోధకులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు సంయుక్తంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో లభించిన ఈ డైనోసార్ ఆనవాళ్లను గతంలో ఎక్కడా గుర్తించలేదని పరిశోధకులు తెలిపారు. ఈ డైనోసార్ సుమారు 177 మిలియన్ సంవత్సరాల (17.7 కోట్ల సంవత్సరాల) క్రితం భూమిపై సంచరించినట్లు పరిశోధకులు అంచనా వేశారు. డైనోసార్లలో మాంసాహారులతో పాటు భారీ శరీరం కలిగి, పొడవైన మెడ ఉండే శాఖాహార డైనోసార్ల వంటివని తెలిపారు. తాజాగా లభించిన డైనోసార్ల అవశేషాలను మరింతగా పరిశోధించి, భారత భూభాగంపై డైనోసార్ల పరిణామ క్రమాన్ని తెలుసుకోబోతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వివరాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ పత్రికలో ప్రచురితం అయ్యాయి. 


Also Read: Coffee Beans Shortage: కాఫీ గింజల కొరత, అంతర్జాతీయంగా పెరుగుతున్న కాఫీ ధరలు


భారత్ నుంచే ఆఫ్రికా, అమెరికాకు డైనోసార్లు!


డైనోసార్ల ఆనవాళ్లు భారత భూభాగంపై లభించడం ఇదే తొలిసారు. డైనోసార్లకు సంబంధించి ఎలాంటి అవశేషాలు గతంలో భారత గడ్డపై లభించలేదు. చైనా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో భారీగా డైనోసార్ల అవశేషాలు లభించాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ డైనోసార్ల ఆనవాళ్లు లభిస్తున్నాయి. 2018 నుంచి జైసల్మేర్ వద్ద థార్ ఎారి ప్రాంతంలో జురాసిక్ రాక్స్ ను గుర్తించే పరిశోధనలు చేస్తున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పేయి వెల్లడించారు. ఈ డైనోసార్ అవశేషాలను గుర్తించిన జురాసిక్ రాక్స్ సుమారు 167 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని తెలిపారు. భారత ఉపఖండంలోనూ ఒకప్పుడు డైనోసార్లు తిరిగాయి అనడానికి ఇదొక నిదర్శనం అని అన్నారు. భారత్ నుంచే డైనోసార్లు ఆఫ్రికా దేశాలకు, అక్కడి నుంచి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.  భారత్ లో అతిప్రాచీన డైనోసార్ శిలాజం లభ్యం కావడం చారిత్రక విశేషమే అని ఐఐటీ రూర్కెలా పరిశోధకులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు అంటున్నారు.