Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామం అంటే శ్రీ మహా విష్ణువు 1000 నామాల వర్ణన. ఈ 1000 నామాలు శ్రీమహావిష్ణువు మహిమను వివరిస్తాయి. అందరూ విష్ణు సహస్రనామాన్ని జపిస్తుంటారు. కానీ, మహిళలు విష్ణు సహస్రనామం జపించడం సరైనదేనా..? స్త్రీలు విష్ణుసహస్రనామ పారాయణం చేయాలా వద్దా అని తెలుసుకుందాం.
సమస్త మానవాళి సంక్షేమానికి ఉద్దేశించినదే విష్ణు సహస్రనామము. మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చని పండితులు చెప్పారు. స్వప్న, సుషుప్తులకు అధి దేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడుసార్లు శివనామ స్మరణ చేసుకుని పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. మంచం మీద పడుకొని ఏ నామాన్నీ పారాయణ చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. అయితే విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు. కానీ హరినామ స్మరణ చేసుకోవచ్చు.
Also Read : శ్రీమహా విష్ణువు వివిధ నామాలు, వాటి అర్థం, ప్రాముఖ్యత మీకు తెలుసా?
1. స్త్రీలు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలా వద్దా అనే విషయంలో చాలా మందికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్త్రీలు కూడా విష్ణుసహస్రనామ పారాయణం చేయవచ్చని కొందరు పండితులు చెబుతుంటే, మరికొందరు పండితులు స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణ చేయకూడదని అంటున్నారు.
2. కానీ, కొందరు పండితులు పురాణాలలో స్వయంగా పార్వతీ దేవి విష్ణుసహస్రనామాన్ని పఠించిందని, ఇతర స్త్రీలు ఎందుకు పఠించకూడదని ప్రశ్నిస్తున్నారు. అందరూ విష్ణు సహస్రనామాన్ని జపించవచ్చని చెబుతున్నారు.
3. మరికొందరు పండితులు విష్ణు సహస్రనామంలోని ఒక శ్లోకాన్ని మాత్రమే స్త్రీలు పఠించకూడదని పేర్కొంటున్నారు. ఈ శ్లోకం తప్ప విష్ణుసహస్రనామం మొత్తం పఠించవచ్చని చెబుతున్నారు. మరి స్త్రీలు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాన్ని పఠించకూడదు..?
"కేనోపాయ లఘునా విష్ణు నామ సహస్రకం".
పఠ్యతే పండితైర నిత్యం స్తోత్రం ఇచ్ఛామి అహం ప్రభో||''
విష్ణు సహస్రనామ పారాయణం ఎలా చేయాలి?
పార్వతీ దేవి "స్త్రోత్తం ఇచ్చామి" అని శ్లోకంలోని భాగాన్ని పండితులకు వదిలి "పతితం ఇచ్చామి" అని చెప్పింది. బహుశా ఈ కారణంగా చాలా మంది పండితులు స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని సూచించారు. కానీ, స్త్రీలు పండితుల సమక్షంలో విష్ణు సహస్రనామం పఠించవచ్చు.
4. విష్ణు సహస్రనామాన్ని పఠనంతో ప్రయోజనాలు
- సంపద పెరుగుదల, శ్రేయస్సు
- గురు దోష నివారణ
- భౌతిక కోరికల నెరవేర్పు
- భయం నుంచి విముక్తి
- విశ్వాసం పెంపు
- అదృష్టం
Also Read : శివుడు, విష్ణువు వేర్వేరా? పురాణాలు ఏం చెబుతున్నాయి?
స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చా లేదా అనే విషయంలో చాలా గందరగోళం ఉంది. పారాయణం సరైనదని కొందరు, పారాయణం తప్పు అని మరికొందరు అంటారు. మీరు పారాయణం చేయాలనుకుంటే, తగిన పండితుని సలహాపై పారాయణం చేయండి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.