Terrorists Attack: జమ్ము కశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో భారత సైన్యం ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు భారత సైనికులు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. హలాన్ అటవీ ప్రాంత పరిసరాల్లో ఉగ్రవాదులు ఉంటారన్న కచ్చితమైన సమాచారం అందడంతో భారత మిలటరీ వర్గాలు సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఆగస్టు 4వ తేదీన ఉగ్రవాదుల కోసం ఆర్మీ జవాన్లు జల్లెడ పడుతుండగా.. ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్ కౌంటర్ గా మారిపోయింది. ఉగ్రవాదుల దాడికి సైన్యం కూడా ఎదురు కాల్పులు చేసింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధ్రువీకరించారు. అయయితే హలాన్ అడవుల్లో ఎత్తైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారని.. ఇప్పటికీ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.